Heavy Rains: తెలంగాణలో మరో రెండ్రోజులు విస్తారంగా వర్షాలు, ఇవాళ అతి భారీవర్షం హెచ్చరిక
Heavy Rains: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇప్పటికే భారీ వర్షాలు నమోదవుతున్న తెలంగాణలో మరో రెండ్రోజులు ఇదే పరిస్థితి ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాల హెచ్చరిక సైతం జారీ అయింది.
Heavy Rains: సెప్టెంబర్ నెల ప్రారంభమౌతూనే తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షపాతం నమోదవుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరో రెండ్రోజుల వరకూ ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, కోస్తా తీరంపై ఏర్పడిన అల్ప పీడనం కాస్తా పశ్చిమ దిశగా కదులుతోంది. ఇది ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గడ్ మీదుగా పయనించనుందని తెలుస్తోంది. ఫలితంగా ఏపీలోని ఉత్తరాంధ్ర సహా, తెలంగాణ వ్యాప్తంగా మరో రెండ్రోజులు భారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే గత రెండ్రోజుల్నించి భారీ వర్షాలతో తడిసిముద్దవుతున్న తెలంగాణకు మరో రెండ్రోజులు భారీ వర్ష సూచన జారీ అయింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులతో వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.
ఏ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
ఇక జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనుండటంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, జోగులాంబ గద్వాల్, నారాయణ పేట్, వనపర్తి, కరీంనగర్, జనగామ, పెద్దపర్లి, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.
ఇక గత 24 గంటలుగా హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. మొన్న రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా హైదరాబాద్ అంతా జలమయమైంది. రోడ్లన్నీ చెరువులుగా మారడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. హైదరాబాద్ పరిసరాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ నదిలో వరద ఉధృతి గణనీయంగా పెరిగిపోయింది. మలక్‌పేట్ ప్రాంతాన్ని కలిపే మూసారాంబాగ్ వంతెన వద్ద వరద నీరు విపరీతంగా పెరగడంతో వంతెనను తాత్కాలికంగా మూసివేశారు. మరో 2-3 రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయనే ఐఎండీ హెచ్చరికల నేపధ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.
కామారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మెదక్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్ధిపేట్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు నమోదయ్యాయి.
Also read: Minister KTR: రూ.700 కోట్లతో తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook