Godavari Floods: బాసర టు పోలవరం వయా భద్రాచలం.. గోదావరి ఉగ్రరూపంతో భయం భయం
Godavari Floods: తెలంగాణలో వారం రోజులుగా ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలతో వరదలు పోటెత్తుతున్నాయి. గతంలో ఎప్పుడు లేనంతగా జూలై నెలలోనే గోదావరి ఉగ్రరూపం దాల్చింది. బాసర నుంచి భద్రాచలం, పోలవరం మీదుగా ధవశేశ్వరం వరకు గోదావరి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.
Godavari Floods: తెలంగాణలో వారం రోజులుగా ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలతో వరదలు పోటెత్తుతున్నాయి. గతంలో ఎప్పుడు లేనంతగా జూలై నెలలోనే గోదావరి ఉగ్రరూపం దాల్చింది. బాసర నుంచి భద్రాచలం, పోలవరం మీదుగా ధవశేశ్వరం వరకు గోదావరి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. భద్రాచలం దగ్గర మంగళవారం సాయంత్రం నీటిమట్టం తగ్గడంతో మూడో ప్రమాద హెచ్చరిక తొలగించారు. అయితే మళ్లీ ఎగువ నుంచి వరద పెరగడంతో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది.
భద్రాచలం దగ్గర ఉదయం తొమ్మిది గంటలకు గోదావరి నీటిమట్టం 51.2 అడుగులకు చేరింది. అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సాయంత్రానికి మూడో ప్రమాద స్థాయికి గోదావరి నీటిమట్టం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాటు వద్ద ఉదయం 6 గంటలకు 15.900 మీటర్లకు చేరింది గోదావరి నీటిమట్టం. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 17.360 మీటర్లకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. పోలవరం దగ్గర నీటిమట్టం అంతకంతకు పెరిగిపోతోంది. పోలవరం స్పిల్ వే గేట్ల ద్వారా ప్రస్తుతం 12 లక్షల 69 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ధవళేశ్వరం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేశ్వరం డ్యాం అన్ని గేట్లు ఎత్తి 15 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు.
నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. ప్రాజెక్ట్ 30 గేట్లు ఎత్తివేశారు. ఎస్సారెస్పీకి ఇన్ ఫ్లో 2 లక్షల 45 వేల 500 క్యూసెక్కులు ఉండగా.. 2 లక్ష 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 75 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల తో పాటు కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్ట్ 46 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్ ఫ్లో 9లక్షల 19వేల 450 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 9లక్షల 7 వేల 73 క్యూసెక్కులుగా ఉంది. పార్వతి బ్యారేజ్ లోకి భారీ గా చేరిన వరద నీరు చేరుతోంది. గోదావరి నది నుండి 8,44,004 క్యూసెక్కులు, జైపూర్, ఇతర ప్రాంతాల నుండి 6200 క్యూసెక్కుల నీరు బ్యారేజ్ లోకి చేరుకుంటుంది. 64 గేట్లు ఎత్తివేసి 8,50,204 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నారు అధికారులు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ దగ్గర ఇన్ ఫ్లో 12 లక్షల క్యూసెక్కులు దాటింది.
పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 6048 క్యూసెక్కులుగా ఉంది. పెరుగుతున్న వరద దృష్ట్యా ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సింగూరు ప్రాజెక్టు సందర్శనకు అనుమతి నిలిపివేశారు. కొమరం భీమ్ జిల్లా ఆడ ప్రాజెక్ట్ లోకి వరద కొనసాగుతుండటంతో ఏడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. నిర్మల్ జిల్లా స్వర్ణ ప్రాజెక్టుకి వరద పోటెత్తడంతో 2 గేటు ఎత్తి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల ప్రాజెక్టుకి వరద పెరగడంతో 4 గేట్లు ఎత్తి దిగువకు వదిలేస్తున్నారు.
Read also: Telanagana Floods: డేంజర్ లో కడెం ప్రాజెక్టు.. చివరి ప్రమాద హెచ్చరిక.. వణికిపోతున్న జనాలు
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook