Telangana Rain Alert: తెలంగాణలో వరుణుడి ప్రతాపం కొనసాగుతోంది. అల్పపీడన ప్రభావంతో కుండపోత వానలు కంటిన్యూ అవుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలో కుండపోతగా వర్షం కురుస్తోంది. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ లో ఈ ఉదయం కేవలం రెండు గంటల్లోనే 78 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. భూపాలపల్లిలో 43, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో 40 మిల్లిమీటర్ల వర్షం కురిసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం తొమ్మిది గంటల వరకు గత 24 గంటల్లో కొమురం భీం జిల్లా అసిఫాబాద్ లో అత్యధికంగా 20 సెంటిమీటర్ల వర్షం కురిసింది, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో 17, ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో 15 సెంటిమీటర్ల వర్షం కురిసింది. ములుగు జిల్లా వెంకటాపురంలో 13 సెంటిమీటర్లు, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరులో 12, ఆదిలాబాద్ జిల్లా బోథ్ లో 11 సెంటిమీటర్ల వర్షం కురిసింది. ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరులో 10, ఆదిలాబాద్ లో 10. నిర్మల్ లో 9, నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందాలో 9 ,కాగజ్ నగర్ లో 9 సెంటిమీటర్ల వర్షం కురిసింది.


గత 24 గంటల్లో రాష్ట్రంలోని తొమ్మిది ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి. 42 ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. 464 ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వాతావరణం ముసురు పట్టి ఉంది. తెలంగాణ వాతావరణ శాఖ వివరాలు ప్రకారం రాష్ట్రంలో జూలై 12 వరకు దాదాపు వంద శాతం అధిక వర్షం కురిసింది. ఇప్పటివరకు 213 మిల్లిమీటర్ల సరాసరి వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. మంగళవారం ఉదయం వరకు 421 మిల్లిమీటర్ల సరాసరి వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజులు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ నాన్ స్టాప్ గా వర్షం కురుస్తోంది.


Read also: Telangana Rain ALERT:కుండపోత వానలతో తెలంగాణ అతలాకుతలం.. గోదావరిలో ప్రమాదకరంగా నీటిమట్టం




స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.



Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook