Heavy Rains in Warangal: వరంగల్ ప్రజలకు సీపీ రంగనాథ్ హెచ్చరికలు
Heavy Rains in Warangal: రానున్న రెండురోజుల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కావున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని సీపీ ప్రజలకు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీస్ శాఖ పరంగా తగిన ఏర్పాట్లతో ముందస్తుగా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతోంది అని చెబుతూ ప్రజలు పోలీసు వారి సూచనలు, సలహాలు పాటిస్తూ సహకరించాలన్నారు.
Heavy Rains in Warangal: గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా కమిషనరేట్ పరిధిలోని ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ బుధవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ జోన్ పరిధిలో పోలీసు యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే, స్థానిక పోలీస్ అధికారులకు లేదా డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసుల సాయం పొందగలరని తెలిపారు. అధికారుల సూచనలను పాటిస్తూ పోలీసు వారికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. భారీవర్షాల నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వరంగల్ పోలీస్ కమిషనర్ పలు సూచనలు చేశారు.
రానున్న రెండురోజుల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కావున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని సీపీ ప్రజలకు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీస్ శాఖ పరంగా తగిన ఏర్పాట్లతో ముందస్తుగా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతోంది అని చెబుతూ ప్రజలు పోలీసు వారి సూచనలు, సలహాలు పాటిస్తూ సహకరించాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు.
ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు, కాలువలు, నదులు, రిజర్వాయర్లు, చెరువుల వద్దకు వెళ్ళవద్దని
చెట్ల కింద, పాడైన భవనాలు కింద, శిధిలావస్థలో ఉన్న భవనాల్లో తలదాచుకోవద్దని, విద్యుత్ స్థంభాలు, ట్రాన్స్ఫార్మర్స్ ముట్టుకోరాదని అన్నారు. ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా చెరువుల్లోకి,, నాలాలు, వాటర్ ఫాల్స్ లేదా చేపల వేటకు వెళ్ళరాదు. అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలి అని వరంగల్ సీపీ రంగనాథ్ స్పష్టంచేశారు. స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ, విద్యుత్, ఆర్ & బి, వైద్యశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడైనా రోడ్లపై వరద ఉదృతితో రోడ్లు తెగిపోయినా, ఉదృతంగా ప్రవహించినా అక్కడికి ఆ గ్రామ ప్రజలు వెళ్లకుండా, రెండు దిక్కులా ప్లాస్టిక్ కోన్స్, బారిగేడ్స్, హెచ్చరిక గల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల అలుగుల దగ్గర, ప్రధాన రహదారులపై ప్రవహించే వాగులు, వంకల దగ్గర నీటి ప్రవాహం గురించి ముందస్తు సమాచారం తెలుసుకొని, పోలీసు అధికారులు, సిబ్బంది ప్రత్యక్షంగా వెళ్లి, అక్కడి పరిస్థితిని పర్యవేక్షించి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని తెలిపారు. వరద నీటికి చెరువులు, కుంటలు నిండి చెరువు కట్టలు తెగిపోయే ప్రమాదం ఉంటుంది. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండగలరు అని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి : Telangana Rains: పూర్తిగా నీటమునిగిన మోరంచపల్లి గ్రామం.. నలుగురు గల్లంతు
వాహనదారులు ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణించండి. వర్షానికి రోడ్లు కొట్టుకుపోయి, గుంతలు ఏర్పడి అందులో నీరు నిల్వ ఉండి ఆ గుంతలు వాహనదారులకు కనిపించక ప్రమాదానికి గురయ్యి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది. కావున జాగ్రత్తగా, నెమ్మదిగా చూసుకొని ప్రయాణించండి అని సూచించారు. వర్షాలకు కల్వర్టు, చిన్నచిన్న బ్రిడ్జిల దగ్గర నీరు ప్రవహిస్తున్నప్పుడు వాహనాలతో ఆ నీటి ప్రవాహాన్ని దాటడానికి సాహసం చేయరాదని వరంగల్ సీపీ రంగనాథ్ హెచ్చరించారు. వరంగల్‌లో భారీ వర్షాలు ధాటికి పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగిన నేపథ్యంలో ట్రాక్టర్‌పై అక్కడికి వెళ్లి పర్యటించి ఆయా బస్తీవాసులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారికి పోలీసులపై భరోసా కల్పించడంలో సీపీ రంగనాథ్ తన వంతు ప్రయత్నం చేశారు.
ఇది కూడా చదవండి : Telangana Rain Updates: అర్ధరాత్రి అభయారణ్యంలో 80 మంది పర్యాటకులు.. ఒక్క ఫోన్ కాల్‌తో..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి