Heavy rains in Hyderabad: హైదరాబాద్‌: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శుక్రవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సాయంత్రం నుంచే మొదలైన భారీ వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో నగరంలోని అనేక లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. లింగోజిగూడలో 10.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు, కుర్మగూడలో 10, హస్తినాపురం 8.8, ఆస్మాన్‌ఘడ్‌ 8.7, సర్దార్‌ మహల్‌ 8.6, కంచన్‌బాగ్‌ 8.4, జూ పార్క్ 8, అల్కాపురి కాలనీ 7.1, అత్తాపూర్ 7, రాజేంద్రనగర్‌లో 6.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నగరంలో కురిసిన భారీ వర్షానికి (Hyderabad rains alert) రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల చెట్లు, హోర్డింగులు నేలకూలడంతో ఆయా మార్గాలగుండా వచ్చే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంకొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో మునిసిపల్ సిబ్బంది, పోలీసులు ట్రాఫిక్‌ను మానిటర్ చేస్తూ సహాయచర్యల్లో పాల్గొనడం కనిపించింది.


Also read : Telangana Assembly session 2021: కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్, ఫ‌స‌ల్ బీమా వ‌ట్టి బోగ‌స్


ఇదిలావుంటే, హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణలోని పలు ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు (Heavy rains in Telangana) కురిశాయి. గ్రామీణ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతానికి సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉంది.


Also read : Degree third councelling in Telangana: డిగ్రీలో 2 లక్షలకుపైగా మిగిలిన సీట్లు


Also read : Huzurabad bypolls: హుజూరాబాద్‌ రిటర్నింగ్‌ అధికారిపై సీఈసీ శశాంక్‌ గోయెల్‌కు YS Sharmila ఫిర్యాదు


Also read : Telangana Assembly : రూ.1,200 కోట్లతో హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాల అభివృద్ధి, త్వరలో పల్లె దవాఖానాలు : సీఎం కేసీఆర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook