ఆసిఫాబాద్ : బుధవారం సాయంత్రం కురిసిన అకాల వడగండ్ల వానకు కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని ఆసిఫాబాద్‌, కెరమెరి, జైనూర్‌, సిర్పూర్‌(యు) మండలాలు చిగురుటాకులా వణికిపోయాయి. కెరమెరి మండలంలోని మహరాజ్‌గూడ, బాబేఝరి, పాటగూడ, శివగూడ పరిసర ప్రాంతాల్లో గంట పాటు ఏకధాటిగా కురిసిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి పలు చోట్ల ఇంటిపైకప్పు రేకులు లేచిపోగా ఇంకొన్ని చోట్ల ఇంటిపైకప్పులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. చౌపన్‌గూడ వద్ద ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఓ భారీ వృక్షం రోడ్డుపై పడిపోవడంతో ఆ మార్గంపై వెళ్లే వాహనాల రాకపోకలకు కొంతసేపు అంతరాయం కలిగింది. మురికిలొంకలో విద్యుత్‌ తీగ తెడిపడటంతో మంటలు చెలరేగాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో విద్యుత్‌ సిబ్బంది అక్కడికి చేరుకొని విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. సిర్పుర్‌(యు) మండలం గుట్టగూడలో ఈదురు గాలులకు 25 ఇండ్లు దెబ్బతిన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : బస్సుల కోసం వెయిటింగా ? ఇదిగో గుడ్ న్యూస్


ఇదిలావుంటే, తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం హైదరాబాద్ నగర శివార్లతో పాటు రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..