Heavy rainfall hits parts of Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. బుధవారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నగరంలోని రోడ్లపై వరద నీరు పొంగిపొర్లుతోంది. అకాలవర్షంతో నగరంలోని పలు కాలనీలు నీటిమయమయ్యాయి. ఈదురు గాలులకు చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. హైదరాబాద్‌లోని ప్రధాన కూడలి వద్ద భారీగా వర్షపు నీరు నిలిచింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్‌లోని చాలా చోట్ల భారీ వర్షం పడుతోంది. ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్‌, మారేడ్‌పల్లి, చిలకలగూడ, బేగంపేట్‌, ఖైరతాబాద్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, సైదాబాద్‌, చంపాపేట, సరూర్‌నగర్‌, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌ నగర్‌, నాగోల్‌, హయత్ నగర్, పెద్ద అంబర్‌పేట్‌, అబ్దుల్లాపుర్‌మెట్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. మెహదీపట్నం, గోల్కొండా, గోశామహల్, కార్వాన్, రాజేంద్ర నగర్, శంషాబాద్, బండ్లగూడ, గండిపేట్, నార్సింగి ప్రాంతాల్లో రాత్రి నుంచి ఈదురుగాలులతో సహా ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. 


వర్షం వలన భాగ్యనగరంలోని రోడ్లు జలమయం అయ్యాయి. పలు చోట్లలోని రోడ్లపై వరద పొంగిపొర్లుతోంది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈదురుగాలుల కారణంగా కొన్ని చోట్లలలో విద్యుత్ అంతరాయం కలిగడంతో జనాలు ఇబ్బందిపడ్డారు. అయితే మండే వేసవిలో వర్షం పడడం వలన చల్లటి వాతావరణం నెలకొంది. దాంతో జనాలు తీవ్ర ఉక్కపోత నుంచి ఉపశమనం పొందుతున్నారు. 


Also Read: Horoscope Today May 4 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి సమస్యలు అధికం అవుతాయి!


Also Read: GT vs PBKS: లివింగ్‌స్టోన్ తుపాను ఇన్నింగ్స్, గుజరాత్‌పై పంజాబ్ ఘన విజయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook