GT vs PBKS: లివింగ్‌స్టోన్ తుపాను ఇన్నింగ్స్, గుజరాత్‌పై పంజాబ్ ఘన విజయం

GT vs PBKS: ఐపీఎల్ 2022లో అప్రతిహతంగా విజయాలు సాధిస్తున్న గుజరాత్ టైటాన్స్‌కు రండవ ఓటమి ఎదురైంది. పంజాబ్ కింగ్స్ లెవెన్ చేతిలో పరాజయం పాలైంది. మరో నాలుగు ఓవర్లు మిగిలుండగానే పంజాబ్ విజయం సాధించింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 3, 2022, 11:39 PM IST
  • గుజరాత్ టైటాన్స్ పై పంజాబ్ కింగ్స్ లెవెన్ ఘన విజయం
  • 16 ఓవర్లలోనే 144 పరుగుల లక్ష్యాన్ని ఛేధించిన పంజాబ్ కింగ్స్
  • లివింగ్‌స్టోన్ చెలరేగి ఆడటంతో ఒకే ఓవర్‌లో 28 పరుగులు
GT vs PBKS: లివింగ్‌స్టోన్ తుపాను ఇన్నింగ్స్, గుజరాత్‌పై పంజాబ్ ఘన విజయం

GT vs PBKS: ఐపీఎల్ 2022లో అప్రతిహతంగా విజయాలు సాధిస్తున్న గుజరాత్ టైటాన్స్‌కు రండవ ఓటమి ఎదురైంది. పంజాబ్ కింగ్స్ లెవెన్ చేతిలో పరాజయం పాలైంది. మరో నాలుగు ఓవర్లు మిగిలుండగానే పంజాబ్ విజయం సాధించింది.

ఐపీఎల్ 2022లో మంగళవారం జరిగిన గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ లెవెన్ ఆసక్తికరంగా సాగింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్‌కు పంజాబ్ కింగ్స్ లెవెన్ నుంచి గట్టి దెబ్బే తగిలింది. కట్టుదిట్టమైన పంజాబ్ బౌలింగ్ ముందు గుజరాత్ టైటాన్స్ సత్తా చాటలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులే చేయగలిగింది. గుజరాత్ టైటాన్స్ నుంచి సాయి సుదర్శన్ 64 పరుగుల తప్ప మరెవరూ నిలవలేకపోయారు. రబడ్ బౌలింగ్ ధాటికి గుజరాత్ విలవిల్లాడింది. రబడ రెండు వరుస బంతుల్లో రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ వికెట్లు పడగొట్టాడు. ఇన్నింగ్స్ మూడవ ఓవర్‌లోనే తొలి వికెట్ శుభమన్ గిల్ అవుట్ కాగా..4వ ఓవర్‌కు రెండవ వికెట్ కోల్పోయింది. 7వ ఓవర్‌కు మూడో వికెట్ కోల్పోయింది.

144 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్ కింగ్స్ లెవెన్ ప్రారంభంలో 2 వికెట్లు కోల్పోయినా ఆ తరువాత నిలదొక్కుకుంది. ముఖ్యంగా శిఖర్ ధావన్ నిలబడి ఆడటంతో పంజాబ్ కింగ్స్ లెవెన్ 16 ఓవర్లలోనే కేవలం 2 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ సీజన్‌లో వరుసగా విజయాలు సాధిస్తున్న గుజరాత్‌కు బ్రేక్ వేసింది. 

ఓ దశలో అంటే చివర్లో 30 బంతుల్లో 27 పరుగులు కావల్సిన పరిస్థితి. ఆ సమయంలో అంటే ఇన్నింగ్స్ 16వ ఓవర్ మొహమ్మద్ షమీ వేశాడు. స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న లివింగ్‌స్టోన్ ఒక్కసారిగా చెలరేగిపోయాడు. వరుసగా మూడు సిక్సర్లు, రెండు బౌండరీలతో అదే ఓవర్‌లో విజయం అందించాడు. శిఖర్ ధావన్ 52 పరుగులతో, లివింగ్ స్టోన్ 30 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. పంజాబ్ ఇప్పటివరకూ పది మ్యాచ్‌లు ఆడి..ఐదింటి గెలిచి..మరో ఐదింట ఓడింది. పది పాయింట్లు గెల్చుకుని పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో నిలిచింది.

Also read: IPL 2022 Umpiring: క్యాచ్ అయితే వైడ్ ఇచ్చాడు.. అతడికి ఉత్తమ అంపైరింగ్‌ అవార్డు ఇవ్వండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News