Horoscope Today May 4 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి సమస్యలు అధికం అవుతాయి!

May 4 2022, Daily Horoscope. తుల, మకర రాశుల వారికి ఈరోజు మిశ్రమకాలం నడుస్తోంది. ఈ రెండు రాశుల వారికి సమస్యలు అధికం అవుతాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 4, 2022, 06:20 AM IST
  • May 4 2022 రాశి ఫలాలు
  • ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే?
  • ఆ రాశుల వారికి సమస్యలు అధికం అవుతాయి
Horoscope Today May 4 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి సమస్యలు అధికం అవుతాయి!

Today Horoscope May 4 2022: మేషం ( Aries): ప్రయత్నాలు చేస్తే మంచి విజయాలు అందుకోవచ్చు. మీ శ్రమకు తోటివారి సహకారం అందుతుంది. కుటుంబ సభ్యులతో కాలాన్ని గడుపుతారు. ఎవరినీ నమ్మకండి. సాయి సందర్శనం చేస్తే మంచిది.

వృషభం (Taurus): భవిష్యత్తు కోసం ప్రణాళికలు చేస్తారు. ఒక శుభవార్త ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విద్యార్ధి, ఉద్యోగ రంగాల వారికి  సానుకూల ఫలితాలు ఉన్నాయి. సమస్యలు తొలగిపోతాయి. శ్రీరామరక్ష స్తోత్రాన్ని చదవండి.

మిథునం (Gemini): ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే మంచి విజయాలు అందుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఇష్టదేవతా సందర్శనం మంచిది.

కర్కాటకం (Cancer): శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాల్లోని వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. వ్యాపార రంగాల వారికి విజయయాలు ఉన్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.

సింహం (Leo): ప్రారంభించిన పనులలో విజయాలు అందుకుంటారు. దగ్గరివారితో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మహాలక్ష్మి ధ్యానం చేస్తే ఫలితాలు అందుకుంటారు.

కన్య (Virgo): కొన్ని పనుల్లో విజయం అందుకుంటారు. శత్రువులు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తారు. బంధు, మిత్రులతో హాయిగా గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త. శ్రీవిష్ణు శ్లోకాలు చదివితే మంచిది.

తుల (Libra): పూర్తిగా మిశ్రమకాలం నడుస్తోంది. శ్రమ పెరుగుతుంది. చిన్నచిన్న విషయాలు చికాకు తెప్పిస్తాయి. సమస్యలు అధికం అవుతాయి. నిరుత్సాహాన్ని విడనాడాలి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

వృశ్చికం (Scorpio): ప్రారంభించిన పనులలో విజయసిద్ది ఉంది. చేపట్టిన పనులను అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. మీమీ రంగాల్లో ఊహించని ఫలితాలు ఉన్నాయి. కుటుంబంతో కలిసి హాయిగా గడుపుతారు. శివాభిషేకం శ్రేయస్సును ఇస్తుంది.

ధనస్సు (Sagittarius): మానసిక ప్రశాంతత లభిస్తుంది. కీలక పనులలో ఆత్మీయుల సహకారం ఉంటుంది. బంధువుల వల్ల మేలు జరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. చంద్రశేఖరాష్టకం శుభప్రదం.

మకరం (Capricorn): మీమీ రంగాల్లో ఆటంకాలు ఉన్నాయి. బుద్ధిబలంతో పనులను పూర్తిచేస్తారు. మీ పనులలో అధికారుల సహకారం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. సమస్యలు అధికం  అవుతాయి. అష్టలక్ష్మీ దేవి సందర్శనం మంచిది.

కుంభం  (Aquarius): చిత్తశుద్ధితో చేసే పనులు మంచి ఫలితాలు ఇస్తాయి. నూతన కార్యక్రమాలను కుటుంబ సభ్యుల అనుమతితో  ప్రారంభించండి. ఒక శుభవార్త మీ కుటుంబంలో ఆనందాన్ని అందిస్తుంది. శత్రువులకు వీలైనంతగా దూరంగా ఉండాలి. ఇష్టదేవతా ధ్యానం ఫలితాలను ఇస్తుంది.

మీనం (Pisces): ఆర్ధికంగా అనుకూల సమయం నడుస్తోంది. కుటుంబసభ్యులతో సమయాన్ని గడుపుతారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. ఇష్టదైన దేవతారాధన ఫలితాలు ఇస్తాయి.

Also Read: GT vs PBKS: లివింగ్‌స్టోన్ తుపాను ఇన్నింగ్స్, గుజరాత్‌పై పంజాబ్ ఘన విజయం

Also Read: Chiranjeevi Family Tour : చిరంజీవి ఫ్యామిలీ టూర్‌.. శ్రీజ, ఉపాసన కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News