Helpline Numbers: రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో తెలంగాణ మొత్తం జలదిగ్భంధంలో చిక్కుకుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో భయానక పరిస్థితి ఏర్పడింది. వాగులు,వంకలు, చెరువులు ఇతర జలాశయాలు పొంగిపొర్లుతూ వరద జనావాసాల్లోకి పోటెత్తుతోంది. అటవీ ప్రాంతమైన ములుగు జిల్లాల్లో మరింత భయానకంగా పరిస్థితి ఉంది. అక్కడి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అయిన సీతక్క అప్రమత్తమయ్యారు. భారీ వర్షాల దృశ్య జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Telangana Rains: తెలంగాణకు భారీ ముప్పు.. మరో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు


 


అత్యవసరం ఉంటే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావద్దు అని సీతక్క విజ్ఞప్తి చేశారు. ములుగు జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో  ఐటీడీఏ ఏటూరు నాగారంలో  కంట్రోల్‌ రూమ్‌ సెల్ నెo. 6309842395, 08717-293246 లేదా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నెంబర్ 1800 425 7109ను సంప్రదించాలని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో  ప్రయాణాలు చేయవద్దని.. వర్షాలు తగ్గుముఖం పట్టేంత వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

Also Read: Heavy Rains: వర్షాల వేళ తెలుగు రాష్ట్ర ప్రజలకు మెగాస్టార్‌ చిరంజీవి కీలక సూచన 


 


అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పెద్ద ఎత్తున వరదలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి అధికారి హెడ్ క్వార్టర్ మైంటైన్ చేయాలి. రోడ్లపై వరద నీటిని ఎప్పటికప్పుడు తొలగించాలి. విద్యుత్, తాగునీటి సరఫరా ఎప్పటికప్పుడు పునరుద్ధరణ చేయాలి. వరద బాధితుల కోసం పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలి' అని సీతక్క సూచించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.