హైదరాబాద్: గత కొన్ని రోజులు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్ళీ పంజా విసురుతోంది. అయితే ఒకవైపు కరోనా కేసుల పెరుగుదల మరోవైపు లాక్ డౌన్ సడలింపులతో మరింత ఆందోళన కల్గిస్తోంది. ఇదిలాఉండగా తెలంగాణలో (Coronavirus Teats) కరోనా పరీక్షల తీరుపై మరోసారి హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మృతదేహాలకు కరోనా పరీక్షలు అవసరం లేదన్న ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. హైరిస్క్ అవకాశాలున్నప్పటికీ పాజిటివ్ వచ్చిన వ్యక్తిని కలిసిన వారికి లక్షణాలు లేకపోయినా పరీక్షలు ఎందుకు చేయడం లేదని హైకోర్ట్ ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఎందుకు తక్కువ టెస్టులు చేస్తున్నారని, మార్చి 11 నుంచి ఇప్పటి వరకు చేసిన పరీక్షల వివరాలన్నీ సమర్పించాలని కోరింది. కరోనా పరీక్షలపై కేంద్రం రెండు సార్లు రాసిన లేఖలు సమర్పించడంతో పాటు కరోనా రక్షణ కిట్లు ఎన్ని ఆస్పత్రుల్లో ఎంత మంది వైద్య సిబ్బందికి ఇచ్చారో ప్రతి అంశానికి సంబంధించి వివరాలు జూన్‌ 4లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.  బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: ఎగసిన కెరటం నటి ఐశ్వర్య రాజేష్.. కంటతడి పెట్టించే విషాదాలెన్నో..


మరోవైపు గ్రీన్ జోన్ జిల్లాగా పరిగణింపబడుతున్న నారాయణపేట జిల్లాలోని మక్తల్ మండలం జెక్లెర్ గ్రామంలో 4నెలల బాబుకు కరనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని, జలుబు, దగ్గుతో మక్తల్ ప్రభుత్వ హాస్పత్రిలో చికిత్స నిమిత్తం సంప్రదించగా అక్కడి నుండి మహబూబ్ నగర్ వెళ్లగా వైద్యులు హైదరాబాద్ నిలోఫర్ కు వెళ్లాలని సూచించారు. కాగా నిలోఫర్ తరలించగా ఈరోజు కరోనా పాజిటివ్ అని వైద్యులు నిర్థారించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..


వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్