High court orders Smita Sabharwal : స్మితా సభర్వాల్‌కు తెలంగాణ హైకోర్టు షాక్
High court orders Smita Sabharwal : తెలంగాణ హైకోర్టు సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్ వ్యక్తిగత వ్యవహారాలకు సర్కారు నిధులు విడుదల చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.15 లక్షలు తిరిగి చెల్లించాలని స్మితాసబర్వాల్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
High court orders Smita Sabharwal : తెలంగాణ హైకోర్టు సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్ వ్యక్తిగత వ్యవహారాలకు సర్కారు నిధులు విడుదల చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఓ కేసు విషయంలో ప్రభుత్వం చెల్లించిన రూ.15 లక్షలు తిరిగి చెల్లించాలని స్మితాసబర్వాల్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవుట్‌లుక్ మేగజిన్ వేసిన స్మితా సబర్వాల్‌పై వేసిన ఓ కార్టూన్ అప్పట్లో వివాదస్పదమైంది. ఈ విషయంలో పరువునష్టం కేసు వేసేందుకు స్మితా సబర్వాల్‌కు ప్రభుత్వం నిధుల కేటాయింపుపై హైకోర్టు విచారణ జరిపింది. స్మితా సబర్వాల్‌కు ప్రభుత్వం నిధులివ్వడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. 2015లో అవుట్ లుక్ మ్యాగజైన్‌పై స్మితాసబర్వాల్ పరువునష్టం దావా వేశారు.
తన ఫోటోను అవమానకరంగా ప్రచురించారని పరువునష్టం కేసు వేశారు స్మిత. ఈ కేసులో కోర్టు ఫీజుల కోసం స్మితా సబర్వాల్‌కు రూ.15 లక్షలు మంజూరు చేసింది ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయంపై అవుట్‌లుక్ సంస్థ, మరో ఇద్దరు వేసిన వ్యాజ్యంపై విచారణ జరిపి హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. 90 రోజుల్లో చెల్లించకపోతే స్మితాసబర్వాల్ నుంచి వసూలు చేయాలని ఆదేశాలిచ్చింది.
ప్రైవేట్ వ్యక్తి ప్రైవేట్ సంస్థపై కేసు వేస్తే అది ప్రజా ప్రయోజనం ఎలా అవుతుందని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణయం అసమంజసమని, ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలు సహేతుకంగా లేకుంటే కోర్టులు సమీక్షించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.
ఐపీఎస్ అధికారి అకున్ సభర్వాల్‌ను వివాహం చేసుకున్న స్మితా సభర్వాల్ అతి చిన్న వయసులోనే సివిల్స్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఆమె హైదరాబాద్ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్, బేగంపేట్‌లో గ్యాడ్యుయేషన్ పూర్తి చేశారు. యూపీఎస్సీలో 2000 సంవత్సరంలో ఆలిండియా నాలుగో ర్యాంక్ సాధించారు. 2001తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారి స్మిత ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సీఎం కార్యాలయంలో నియమితులైన తొలి మహిళా అధికారి స్మితా సభర్వాల్.
Also Read - SARKAARU VAARI PAATA : సీఎం జగన్ డైలాగ్‌తో క్రేజ్ పెంచిన మహేష్
Also Read- SVP Trailer Record: రికార్డులు బద్దలు కొట్టిన 'సర్కారు వారి పాట' ట్రైలర్.. అర్ధ గంటలోనే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.