SVP Trailer Record: రికార్డులు బద్దలు కొట్టిన 'సర్కారు వారి పాట' ట్రైలర్‌.. అర్ధ గంటలోనే..!

SVP Trailer gets fastest 5M views. 'సర్కారు వారి పాట' సినిమా ట్రైలర్‌ గత రికార్డులను బద్దలు కొట్టింది. విడుదలైన కొద్ది నిమిషాల్లోనే అత్యంత వేగంగా ఐదు మిలియన్ వ్యూస్ సాధించింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 2, 2022, 05:54 PM IST
  • సర్కారు వారి పాట ట్రైలర్ రిలీజ్
  • ఓసారి చూస్తే.. మరలా మరలా చూడాలనిపిస్తోంది
  • రికార్డులు బద్దలు కొట్టిన ట్రైలర్‌
SVP Trailer Record: రికార్డులు బద్దలు కొట్టిన 'సర్కారు వారి పాట' ట్రైలర్‌.. అర్ధ గంటలోనే..!

Sarkaru Vaari Paata movie Trailer gets fastest 5M views: 'సూపర్‌ స్టార్‌' మహేశ్‌ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా ట్రైలర్‌ కొద్దిసేపటి క్రితం వచ్చేసింది. రెండు నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్ల పాటు సాగే ఈ ట్రైలర్.. అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది. మహేశ్ బాబు డైలాగ్స్, పరశురామ్ టేకింగ్, కీర్తి సురేశ్‌ అందాలు, వెన్నల కిషోర్ టైమింగ్ అద్భుతంగా ఉన్నాయి. ట్రైలర్‌ ఓసారి చూస్తే.. మరలా మరలా చూడాలనిపిస్తోంది. సూపర్ స్టార్ ఫాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. 

'సర్కారు వారి పాట' సినిమా ట్రైలర్‌ గత రికార్డులను బద్దలు కొట్టింది. విడుదలైన కొద్ది నిమిషాల్లోనే అత్యంత వేగంగా ఐదు మిలియన్ వ్యూస్ సాధించింది. ఇటీవలి కాలంలో పాన్ ఇండియా సినిమాలుగా వచ్చిన పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్ 2.. ఆచార్య సినిమాలు కూడా ఇంత తక్కువ సమయంలో ఈ రేంజ్‌లో వ్యూస్ అందుకోలేకపోయాయి. ఇక గంట తర్వాత యూట్యూబ్‌లో ఏకంగా 2,623,200 వ్యూస్ కొల్లగొట్టింది. ప్రస్తుతం సర్కారు వారి పాట' సినిమా ట్రైలర్‌ ట్రెండింగ్‌లో ఉంది. 

బ్యాంకు కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కిన 'సర్కారు వారి పాట' సినిమాకు పరశురామ్‌ దర్శకత్వం వహించారు. మహేశ్‌ బాబు సరసన కోలీవుడ్ భామ కీర్తి సురేశ్‌ నటించారు. సముద్రఖని, నదియా, వెన్నెల కిశోర్‌, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ సంయుక్తంగా నిర్మించాయి. వేసవి కానుకగా సర్కారు వారి పాట సినిమా.. మే 12న విడుదల కానుంది. 

Also Read: Sarkaru Vaari Paata Trailer: నేను విన్నాను.. నేను ఉన్నాను! సర్కారు వారి పాట ట్రైలర్‌లో సీఎం జగన్ డైలాగ్

Also Read: Eid ul Fitr 2022: ఇండియా, పాకిస్తాన్ దేశాల్లో ఈదుల్ ఫిత్ర్ రంజాన్ పండుగ రేపు, ఎలా జరుపుకుంటారంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News