hostel woman trying to worship naked with a girl in peddapalli: ప్రస్తుతం సమాజంలో  టెక్నాలజీ రంగంలో ఎంతో ముందుకు దూసుకుని పోతుంది. అయిన కూడా ఇప్పటికి మూఢనమ్మకాల ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. చేతబడి, బాణామతి అంటూ కొంత మంది అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దొంగబాబాలు బురిడికొట్టిస్తున్నారు. మరికొంత మంది పూజల పేరిట, నిధుల పేరిట మోసాకలు తెరతీస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో ఇలాంటి ఘటనల్లో కొన్ని చోట్ల అమాయకులు బలౌతుంటే.. మరికొన్ని చోట్ల చదువుకున్న వాళ్లే ఇలాంటి వారి చేతిలో మోసపోతున్నారు. ఈ క్రమంలో పెద్ద పల్లి జిల్లా మంథనిలోని హస్టల్ లో... ఒక బాలికతో నగ్న పూజలు చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది.


పూర్తి వివరాలు..


మంథనిలోని బాలికల వసతి గృహంలో సోమవారం రాత్రి బాలికతో నగ్నపూజలకు యత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. సదరు యువతి అమాయకత్వాన్ని, పేదరికాన్ని ఆపరాగా చేసుకుని.. హస్టల్ పనిమనిషి.. నగ్నంగా పూజలు చేస్తే కనక వర్షం కురుస్తుందని చెప్పిందంట. అంతే కాకుండా.. బాలికను హస్టల్ లోని కిచెన్ లోకి తీసుకెళ్లి పూజల కోసం ప్రయత్నిచిందంట. దీంతో భయపడిపోయిన సదరు బాలిక తప్పించుకుని.. తమ బంధువుల ఇంటికి వెళ్లిపోయిందంట


. దీంతో  ఈ విషయం కాస్త వారి తల్లిదండ్రులకు తెలియడంతో.. వారి హస్టల్ కు వచ్చి నిలదీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  ఈ క్రమంలో బాలిక నాలుగు రోజులుగా హస్టల్ కు వెళ్లకుండా బయటే ఉండిపోయిందంట. దీంతో వీరి తల్లిదండ్రులు హస్టల్ వద్దకు వచ్చి..అక్కడి వారిని నిలదీయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ప్రస్తుతం పోలీసులు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారంట.


Read more: TGPSC Groups- 2: తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. గ్రూప్2 ఎగ్జామ్‌ వాయిదా వార్తలపై టీజీపీఎస్సీ కీలక ప్రకటన..


 ప్రలోభ పెట్టిన మహిళను అదుపులోకి తీసుకొని, పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తొంది. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్టు మంథని ఎస్‌ఐ తెలిపారు. పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకోంటామని పోలీసులు వెల్లడించారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.