Huzurabad bypolls: కాంగ్రెస్ పార్టీకి కౌశిక్ రెడ్డి రాజీనామా
Kaushik Reddy to join TRS ahead of Huzurabad bypolls: హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి హుజురాబాద్‌కి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కౌశిక్ రెడ్డి తన రాజీనామా లేఖను పంపించారు. తనకు ఇన్నేళ్లపాటు పార్టీలో అవకాశాలు కల్పించినందుకు రాహుల్ గాంధీకి, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్టు కౌశిక్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.
Kaushik Reddy to join TRS ahead of Huzurabad bypolls: హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి హుజురాబాద్‌కి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కౌశిక్ రెడ్డి తన రాజీనామా లేఖను పంపించారు. తనకు ఇన్నేళ్లపాటు పార్టీలో అవకాశాలు కల్పించినందుకు రాహుల్ గాంధీకి, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్టు కౌశిక్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీని వీడాలని నిర్ణయంచుకున్నట్టు వెల్లడించిన కౌశిక్ రెడ్డి.. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని నిర్ణయంచుకున్నట్టు తెలిపారు.
కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ నేతలతో సన్నిహితంగా ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని అభియోగంపై పీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీస్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాతే కౌశిక్ రెడ్డి పార్టీకి రాజీనామా (Kaushik Reddy's resignation) చేయడం గమనార్హం. కౌశిక్ రెడ్డి వైఖరి చూస్తోంటే ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు (Kaushik Reddy to join TRS party) నిర్ణయం తీసుకున్న తర్వాతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టున్నారు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also read : మంత్రి KTR convoy అడ్డుకున్న ABVP కార్యకర్తలు
హుజురాబాద్ ఉప ఎన్నిక (Huzurabad by-election) నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలకు హుజురాబాద్ కేంద్రంగా నిలుస్తోంది. హుజురాబాద్‌లో బీజేపి అభ్యర్థి మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ని (Etela Rajender) ఓడించేందుకు టీఆర్ఎస్ సర్వశక్తులూ ఒడ్డుతుండగా.. మరోవైపు బీజేపి సైతం టీఆర్ఎస్ పార్టీపై గెలిచేందుకు అంతే పట్టుదలతో ముందుకు సాగుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి ఎవరు (Who is Huzurabad bypolls congress candidate) అనే విషయంలో పార్టీ అధిష్టానం ఇంకా ఓ నిర్ణయానికి రాకముందే.. అక్కడ గత ఎన్నికల్లో ఈటల రాజేందర్‌పై పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.
Also read: Komatireddy Venkat Reddy: టీపీసీసీ చీఫ్ కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి, అందుకే ఆవేదన చెందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook