హైదరాబాద్ లో డిసెంబర్ 5,6 వ తేదీల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని నగర పోలీస్ కమీషనర్ పీవీ శ్రీనివాసరావ్ తెలిపారు. డిసెంబర్  6వ తేదీ బ్లాక్ డే సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకూడదనే ఈ నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కమిషనర్ జారీచేసిన ఉత్తర్వులు వెంటనే అమలులోకి వచ్చాయి. డిసెంబర్ 5 వ తేదీ ఉదయం 6 :00 గంటల నుండి డిసెంబర్ 7వ తేదీ ఉదయం 6:00 గంటల వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

144 సెక్షన్ అమలులో ఉన్న ప్రాంతాల్లో ముఖ్యమైన నిబంధనలు 


* నలుగురు లేదా అంతకు మించి ఒకేచోట గుమిగూడరాదు. 


* సభలు, సమావేశాలు, ర్యాలీలలో ప్రజలను రెచ్చెగొట్టే విధంగా ప్రసంగాలు చేయరాదు. 


* సభలు, సమావేశాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి. 


పైవాటికి విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠినచర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు పెడతామని సిపీ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పాతబస్తీలో సుమారు మూడు వేల మంది పోలీసులతో పహారా కాస్తున్నారు.