Software girl raped in auto at Gachibowli: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన కూడా మహిళలపై దాడులు మాత్రం ఆగడంలేదు. పోక్సో, నిర్భయ వంటి కఠిన చట్టాలు అమలు పరుస్తున్న కూడా కామాంధులు మాత్రం మారడంలేదు. ప్రతి చోట అమ్మాయిలపై వేధింపుల ఘటనలు వార్తలలో ఉంటున్నాయి.  ఈ క్రమంలో బస్టాండ్, రైల్వేస్టేషన్, మెట్రోలు, పని ప్రదేశాలలో కూడా మహిళలు వేధింపులకు గురౌతున్నారు. అయితే.. కొన్ని చోట్ల యువతులు ఇంట్లో వాళ్ల నుంచి వేధింపులను ఎదుర్కొంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొన్ని చోట్ల కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి, సోదరులు కూడా అత్యాచారానికి పాల్పడిన ఘటనలు అనేక సందర్భాలలో వార్తలలో నిలిచాయి. అంతే కాకుండా.. అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్ కు వెళ్తే అక్కడ కూడా మహిళలు వేధింపులు ఎదుర్కొన్న ఘటనలు కొకొల్లలు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని గచ్చిబౌలీలో ఒక యువతి అత్యాచారానికి గురైన ఘటన ప్రస్తుతం పెనుదుమారంగా మారింది.


పూర్తి వివరాలు..


హైదరబాద్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.  ఒక సాఫ్ట్ వేర్ యువతి ఆర్సీపురం నుంచి గచ్చిబౌలీకి వెళ్లేందుకు ఆటో ఎక్కింది.. అప్పుడు రాత్రి 2.30 గంటల సమయం అవుతుంది. అయితే.. యువతి ఒక్కతే ఉండటం, రోడ్డంతా నిర్మానుష్యంగా ఉండటంతో ఆట్రోడ్రైవర్ మరో యువకుడు , యువతిపై అత్యాచారానికి ప్లాన్ వేసినట్లు తెలుస్తొంది. అప్పటికే యువతి కూడా చాలా అలసిపోయి ఉండటంను వీరు గమనించారు. రాత్రి పూట ఆటోను గచ్చీబౌలీ సమీపంలోని మసీదు బండ దగ్గరకు పొనిచ్చారు.


అక్కడ ఆటోను ఒక్కసారిగా పొదల్లోకి తీసుకెళ్లి యువతిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా.. యువతిని ఇద్దరు కలిసి పొదల్లోకి లాక్కెళ్లి అరవకుండా.. కాళ్లు చేతులు, పట్టుకుని అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. బాధితురాలు తీవ్రమైన పెనుగులాట చేసినట్లు కూడా  తెలుస్తొంది. కానీ కామాంధుల పశుబలం ముందు మాత్రం ఆమె వారిని నిలవరించలేకపోయినట్లు తెలుస్తోంది. కాసేపటికి యువతిని వదిలేసి.. కామాంధులు ఆటోలో అక్కడి నుంచి పరారయ్యారు.


Read more: Muthyalamma Temple: రంగంలోకి దిగిన అమిత్‌షా..?.. ముత్యాలమ్మ విగ్రహాం ఘటనపై సీరియస్.. హైదరాబాద్‌కు కేంద్ర బలగాలు..


యువతి ఏలాగోలా..తన వాళ్లకు ఫోన్ చేసి ఇంటికి చేరుకుంది. జరిగిన ఘటనపై ఇంట్లో వాళ్లకు చెప్పి గచ్చిబౌలీ పీఎస్ కు వెళ్లి అక్కడ ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అక్కడ సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తొంది. అయితే.. ప్రస్తుతం పోలీసులు మాత్రం.. యువతిని వైద్యపరీకల కోసం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తొంది. ఈ ఘటన మాత్రం హైదరబాద్ ను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిందని చెప్పుకొవచ్చు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter