Ex IT Minister KTR Fire On CM Revanth Reddy: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దిశగా అడుగులు వేస్తుంది. దీనిలో భాగంగా ఇప్పటికే ఇచ్చిన ఆరు గ్యారంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించింది. అదే విధంగా మరికొన్ని స్కీమ్ ల ఆచరణ దిశగా అడుగులు వేస్తుంది. తెలంగాణలో అన్నింటిలో తనదైన మార్కుకన్పించేలా సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Rithu Chowdary hot Show: రెడ్ గౌనులో రీతూ అందాల బాంబ్.. చూస్తే తట్టుకోలేరు..


దీనిలో భాగంగానే ఇప్పటికే టీఎస్ స్థానంలో టీజీ వచ్చేలా మార్పులు చేశారు. ఇక తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా అనేక మార్పులు సూచించారు. తెలంగాణ తల్లి మన అస్తిత్వానికి చిహ్నమన్న సీఎం రేవంత్ రెడ్డి, గత ప్రభుత్వం బంగారం, వజ్రాలు రాచరికపు పొకడలతో రూపొందించిందన్నారు. ఈ క్రమంలోనే ఈరోజు మంత్రి మల్లు విక్రమార్క భట్టీ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెన్ ను ప్రవేశ పెట్టారు. ఈ క్రమంలోనే తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ రేవంత్ రెడ్డి ఇటీవల తీసుకున్న అనేక నిర్ణయాలను తనదైన స్టైల్ లో స్పందించారు.


సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ అధికారిక ముంద్రలో చార్మినార్, కాకతీయ కళాతోరణం ఉండొద్దని చెప్పడం పై మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ నేత సీఎం పదవి గుంపు మేస్త్రీ అన్నారని, రేవంత్ ను చూస్తే అలానే ఉందన్నారు. జయజయహే తెలంగాణ పాటను తెలంగాణ జాతీయ గీతంగా పెడుతున్నామన్నారు. ఈ పాటలోనే గోల్గొండ కోట, రామప్ప ల, చార్మినార్  వంటి ప్రదేశాల గురించి గొప్పగా ఉందన్నారు. అదేవిధంగా ఇతర దేశాలు, ప్రపంచం నుంచి టూరిస్టు ఎవరొచ్చిన కూడా మొదట చార్మినార్ కు వెళ్తారని గుర్తుచేశారు.


Read More: Ramaphalam: రామఫలం తిని తినండి.. శరీరంలో జరిగే మ్యాజిక్ మీరే చూడండి..


రేవంత్ రెడ్డి దిమాక్ తలలో ఉందా.. మోకాలులో జారిపోయిందా అని ఎద్దెవా చేశారు. నోటికొచ్చినట్లు మాట్లడొద్దని, ఆలోచించి నిర్ణయాలు తీసుకొవాలని, ఏదో ఆగమాగం పనులు చేయోద్దని సీఎం రేవంత్ పై సెటైర్ లు వేశారు. ఆరుగ్యారంటీల పథకం అమలు చేసేలా చర్యలు తీసుకొవాలని, అడ్డమైన మాటలతో టైమ్ పాస్ చేయోద్దన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం హుందాగా వ్యవహరించింది కానీ.. చిల్లర మాటలు మాట్లాడలేదని బీఆర్ఎస్ లీడర్ , మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook