Hyderabad collector Sweta mohanty: హైదరాబాద్: తెలంగాణలో నిత్యం వెలుగుచూస్తున్న కరోనావైరస్ పాజిటివ్ కేసులలో హైదరాబాద్ నగరంలోనే ( Hyderabad ) అధిక సంఖ్యలో కేసులు ఉంటున్నాయనే సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతి కూడా కరోనావైరస్ సోకిన బాధితుల జాబితాలో చేరారు. అవును, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతికి ( IAS Sweta mohanty ) సైతం కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 Also read: Telangana: జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు


హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతితో పాటు, ఆమె వాహనం డ్రైవర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ సహా కలెక్టరేట్‌లో ( Hyderabad collectorate ) పనిచేసే సిబ్బందిలో మొత్తం 15 మందికిపైగా కరోనాతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. గత ఐదు రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో అప్పటి నుంచే హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లిన కలెక్టర్ శ్వేతా మహంతి గురువారం కరోనా పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చినట్టు సమాచారం. 


Also read: Heavy rain: రాష్ట్రంలో 3 రోజులపాటు భారీ వర్షాలు.. నిండుతున్న ప్రాజెక్టులు


ఇదిలావుంటే, తెలంగాణలో గురువారం రాత్రి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ( Health bulletin ) ప్రకారం రాష్ట్రంలో 1676 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ కాగా.. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ ( GHMC ) పరిధిలోనే కరోనా పాజిటివ్‌తో బాధపడుతున్న బాధితుల సంఖ్య 788 మందిగా ఉన్నట్టు తేలింది. ( Also read: International flights: అమెరికా, ఫ్రాన్స్ విమానాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ )


జూలై 16 నాటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య మొత్తం 41,018 మందికి చేరుకుంది. కరోనా కారణంగా నిన్న గురువారం 10 మంది మృతి చెందగా, ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య మొత్తం 396 కు చేరింది ( COVID-19 deaths ).


Also read: Telangana: ఇటీవల ట్రాన్స్‌ఫర్ అయిన ఐఏఎస్ఆఫీసర్స్ జాబితా