IAS officials transfers: హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్ ( CS Somesh Kumar ) జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న శాంతి కుమారిని అక్కడి నుంచి బదిలీ చేసి.. అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఇప్పటివరకు శాంతి కుమారి కొనసాగిన స్థానంలో ఢిల్లీలో తెలంగాణ భవన్ ఓఎస్డీగా ఉన్న సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీకి ఆ బాధ్యతలు అప్పగించారు. ( Also read: Telangana: మరో 11 మందిని బలి తీసుకున్న కరోనా )
ప్రస్తుతం కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గా ఉన్న యోగితా రాణాను ఆ స్థానం నుంచి బదిలీ చేసి వాకాటి కరుణకు ఆ బాధ్యతలు అప్పగించారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరికి అదనంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ బాధ్యతలు కూడా నిర్వర్తించాల్సిందిగా ప్రభుత్వం స్పష్టంచేసింది.
అడిషనల్ సీఈవో-జ్యోతి బుద్ధప్రకాష్, ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్ జనరల్-అదర్ సిన్హా, నాగర్‌కర్నూల్ కలెక్టర్‌గా ఎల్ శర్మన్, పాఠశాల విద్యా డైరెక్టర్‌గా శ్రీదేవసేన, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా కేఎస్ శ్రీనివాస రాజు, సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా విజయ్ కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ యోగితా రాణా, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, ఆదిలాబాద్ కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఇ. శ్రీధర్, రాణి కౌముదిని దేవికి కార్మిక, ఉపాధి కల్పనశాఖ కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. Also read: COVID-19 vaccine: కొవిడ్-19 వ్యాక్సిన్ ప్రయోగాల్లో ఏయే దేశాలు ముందున్నాయి.. సమగ్ర కథనం
అలాగే ప్రస్తుతం సాగు నీటి పారుదల ముఖ్య కార్యదర్శిగా ఉన్న రజత్‌కుమార్‌కు అదనంగా పర్యావరణ శాస్త్ర సాంకేతిక అదనపు బాధ్యతలు అప్పగించారు. తర్వాతి ఆదేశాలు వెలువడే వరకు రజత్ కుమార్ ఆ స్థానంలో కొనసాగనున్నారు. ( Also read: Telangana: కరోనాకు ఉచిత చికిత్స, ఫ్రీగా కోవిడ్ టెస్టులు )