Renuka Chowdhury on Drugs Case: హైదరాబాద్ డ్రగ్స్ కేసులో పేర్లు వినిపించిన బడా ఫ్యామిలీ పిల్లల తరుపున  వారి తల్లిదండ్రులు స్పందిస్తున్నారు. ఇప్పటికే నిహారిక కొణిదెల తరుపున నాగబాబు, తన కొడుకు అరవింద్ తరుపున మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఈ వ్యవహారంపై స్పందించారు. తాజాగా మాజీ ఎంపీ రేణుకా చౌదరి ఈ వ్యవహారంపై స్పందించారు. పోలీసులు దాడి చేసిన పబ్ తన కూతురిదేనని జరుగుతున్న ప్రచారాన్ని రేణుకా చౌదరి ఖండించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'నా కుమార్తె తేజస్విని చౌదరిపై మీడియాలో వస్తున్న వార్తలను ఖండిస్తున్నాను. రాడిసన్ బ్లూ హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌పై పోలీసుల దాడికి సంబంధించి నా కూతురిపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం. తేజస్వినిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారని జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాను. అందులో ఎలాంటి నిజం లేదు.' అని రేణుకా చౌదరి స్పష్టం చేశారు. ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌కి తన కూతురు యజమాని కాదని, దాని స్థాపనలో, నిర్వహణలో తన కూతురికి ఎలాంటి ప్రమేయం లేదని వెల్లడించారు. 


ఆదివారం (మార్చి 3) తెల్లవారుజామున 2.30గం.-3గం. ప్రాంతంలో పోలీసులు రాడిసన్ బ్లూ హోటల్‌పై దాడులు జరిపారు. హోటల్లోని పబ్‌లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దాదాపు 150 మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అక్కడ ఉపయోగించిన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో ఎక్కువమంది బడా బాబుల పిల్లలే ఉండటంతో ఈ వ్యవహారం సంచలనం రేపింది. రాహుల్ సిప్లిగంజ్, నిహారిక కొణిదెల, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమార్, మాజీ డీజీపీ కూతురు, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఇలా పలువురి పేర్లు బయటకొచ్చాయి. 


ఈ వ్యవహారంపై స్పందించిన రాహుల్ సిప్లిగంజ్ తాను డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టం చేశాడు. ఏ పరీక్షకైనా తాను సిద్ధమేనని ప్రకటించాడు. ఇక తన కూతురు నిహారిక ఎటువంటి తప్పు చేయలేదని మెగా బ్రదర్ నాగబాబు ఓ వీడియో విడుదల చేశారు. అటు అంజన్ కుమార్ యాదవ్ కూడా తన కొడుకుపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.


Also Read: Hyderabad Drugs Case: నిజానిజాలు తెలుసుకోకుండా నన్నెందుకు బద్నాం చేస్తున్నారు.. మీడియాపై నటి హేమ ఫైర్... 


Niharika Konidela: నిహారిక తప్పు లేదు.. అనవసర ఊహాగానాలు వద్దు... నాగబాబు రియాక్షన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook