Minor Girl Gang Rape: తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. కేసు విచారణలో గంటకో సంచలనం బయటికి వస్తోంది. బాధితురాలి పట్ల నిందితులు ఎంత అరాచకంగా వ్యవహరించారు... గ్యాంగ్ రేప్ తర్వాత తప్పించుకునేందుకు వేసిన ఎత్తులు చూసి పోలీసులే షాకవుతున్నారు. సామూహిక అత్యాచారం కేసులో ఇప్పటివరకు ఐదుగురు నిందితులను గుర్తించిన పోలీసులు.. ముగ్గురిని జైలుకు పంపించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరిని శనివారం రాత్రి అదుపులోనికి తీసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్యాంగ్ రేప్ కేసు నిందితుల్లో ముగ్గురు రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్లే. ఒకడు వక్ఫ్ బోర్డు చైర్మెన్ కాగా.. మరొకరి తండ్రి జీహెచ్ఎంసీ కార్పొరేటర్. మరొక నిందితుడి తండ్రి సంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ లో కీలక నేత. మిగిలిన ఇద్దరు నిందితుల్లో ఒకరు ఎంఐఎం ఎమ్మెల్యే సోదరుడికి కొడుకు. మరో నిందితుడు సాదుద్దీన్ తండ్రిరి ఒక పార్టీ సీనియర్ నేత ప్రధాన అనుచరుడు. గ్యాంగ్ రేప్ కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడి పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బాలికను మొదట బెంచ్ కారులో తీసుకెళ్లిన నిందితులు.. కొంత దూరం వెళ్లాక బెదిరించి బెంజి కారు నుంచి ఇన్నోవా వాహనంలోని తరలించారు. ఇన్నోవా కారులోనే  ఎమ్మెల్యే కుమారుడు ఉన్నారు. అయితే పోలీసులు మాత్రం ఎమ్మెల్యే కొడుకు కొద్ది నిమిషాల్లోనే ఇన్నోవా కారు దిగి బేకరీ వైపు వెళ్లారని చెబుతున్నారు,


లీకైన వీడియోలో బాధితురాలితో అసభ్యంగా ప్రవరించింది ఎమ్మెల్యే కొడుకు అనే అనుమానిస్తున్నారు. కారులో వక్ప్ బోర్డు చైర్మెన్ కొడుకు క్లియర్ గానే కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారిన తర్వాత మరోసారి బాధితురాలిని పోలీసులు వివరాలు సేకరించారని తెలుస్తోంది. ఆమె చెప్పిన సమాచారంతో ఈ కేసులో ఎమ్మెల్యే తనయుడిని ఏ6 నిందితుడిగా చేర్చాలని పోలీసులు నిర్ణయించారని సమాచారం. మరోవైపు ఓ పార్టీకి చెందిన బడా నేత సూచనతో కేసు పూర్తిగా బయటికి రాకముందే ఎమ్మెల్యే కొడుకుని దుబాయ్ పంపించి వేశారనే ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా ఇవే చెబుతున్నారు. ఇక పోలీసులు చెబుతున్న దానికి.. బయటికి వస్తున్నవిషయాలకు పొంతన లేకపోవడంతో... గ్యాంగ్ రేపు కేసును నీరుగార్చుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యే కొడుకును కేసు నుంచి బయటపడేసేందుకు కొందరు బడా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. నిందితులను ఐదు రోజులైనా పోలీసులు పట్టించుకోకపోవడంపైనా విమర్శలు వస్తున్నాయి. పోలీసులు కేసు ఫైల్ చేసి విచారణ ప్రారంభించేటప్పటికే.. నిందితులు గ్యాంగ్ రేప్ జరిగిన ఇన్నోవా కారులో ఆనవాళ్లు, ఆధారాలు దొరకకుండా చేశారని అంటున్నారు.


Read also: Minor Girl Gang Rape: మైనర్ బాలిక కారు వీడియో ఎలా లీకైంది.. రఘునందన్ కు పంపింది ఎవరు?


Read also: Pawan Kalyan: చంద్రబాబును పవన్ కల్యాణ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా?టీడీపీ-జనసేన పొత్తు సాధ్యమేనా?  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook