Hyderabad Gang Rape: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మేజర్ గా ఉన్న కీలక నిందితుడు సాదుద్దీన్ ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. సాదుద్దీన్ విచారణలో కొత్త విషయాలు బయటికి వస్తున్నాయని తెలుస్తోంది. పక్కా ప్లాన్ ప్రకారమై మైనర్ బాలికను ట్రాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారని తెలుస్తోంది. ఈ కేసులో పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. కోర్టుకు పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులోనూ సంచలన అంశాలు ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనలో మాస్టర్ మైండ్ అంతా జీహెచ్ఎంసీ కార్పొరేటర్ కొడుకుదేనని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. రిమాండ్ రిపోర్టులో ఉన్న వివరాల ప్రకారం.. మే28న పబ్ కు వెళ్లింది మైనర్ బాలిక. అయితే అదే పార్టీకి తన ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లిన కార్పొరేటర్ కొడుకు.. పబ్ లో బాధితురాలితో మాట కలిపాడు. గతంలో కలిశామని చెప్పాడు. అతనితో బాలిక కూడా మాట్లాడింది. పార్టీ ముగియగానే తన కారులో ఇంటి దగ్గర దించేస్తానని చెప్పాడు కార్పొరేటర్. అతని మాటలు నమ్మిన బాలిక కారులో వెళ్లింది. అప్పటికే కారులో మరో ముగ్గురు నిందితులు ఉన్నారు. బెంజ్ కారులో బాలికను తీసుకెళ్లిన వెళ్లిన నిందితులు..  బంజారాహిల్స్‌లోని కాన్సు బేకరీ వద్దకు వెళ్లాక తమ ప్లాన్ అమలు చేశారు.కారులోనే మైనర్ బాలిక బ్యాగు, ఐ గ్లాసెస్, సెల్‌ఫోన్‌ లాక్కొన్నారు. బాలికను కారులోనే ఉంచి బేకరీకి వెళ్లి తన కావాల్సినవి తినేసి సిగరెట్లు తాగారు. తర్వాత కారులో వస్తేనే తీసుకున్న వస్తువులు ఇస్తామంటూ బాలికను బెదిరించారు. ఇన్నావోలో తీసుకెళ్లారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి వెనకాల ఉన్న ఖాళీ ప్రదేశంలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ చేశారు. తర్వాత బాలికను తిరిగి పబ్ దగ్గర వదిలేసి వెళ్లారు.


ఇక కస్టడీలో పోలీసులకు కీలక నిందితుడు సరైన సమాచారం ఇవ్వడం లేదని తెలుస్తోంది. తొలి రోజు డీసీపీ ఇక్బాల్‌ సిద్దిఖీ, బంజారాహిల్స్‌ ఏసీపీ సుదర్శన్‌  సాదుద్దీన్‌ మాలిక్‌ను ఆరు గంటలకుపైగా విచారించారు. పోలీసుల ప్రశ్నలకు అతడు పొడిపొడిగా సమాధానాలిచ్చినట్లు తెలిసింది. ఆ కేసులో నిందితులుగా ఉన్న మైనర్లతో సంబంధాలపై ప్రశ్నించగా సాదుద్దీన్‌ సైలెంట్ గా ఉన్నారని తెలుస్తోంది. జువెనైల్ కోర్టు అనుమతితో ఈ కేసులో నిందితులుగా ముగ్గురు మైనర్లను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వక్ఫ్ బోర్డు చైర్మెన్ కొడుకు, సంగారెడ్డి టీఆర్ఎస్ నేత తనయుడు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్ కుమారుడిని ఐదు రోజుల కస్టడీకి జువెనైల్ కోర్టు అనుమతి ఇచ్చింది. మిగిలిన ఇద్దరు మైనర్లు అయిన ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు, బెంజ్ కారు ఓనర్ తనయుడి కస్టడీకి పోలీసులు పిటిషన్ వేశారు. జువెనైల్ కోర్టు తీర్వాత వాళ్లను కూడా పోలీసులు ప్రశ్నించనున్నారు. మరోవైపు  విచారణ సమయంలో నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లను... మేజర్లుగా పరిగణించాలని జూబ్లీహిల్స్‌ పోలీసులు జువెనైల్‌ జస్టిస్‌ బోర్డును కోరనున్నారు.


Read also: NTR: వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ... తెలుగు ప్రజలకు ఆర్బీఐ శతకోటి కానుక  


Read also: President Election: రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి ఉంటారా? కేసీఆర్ నిలబెట్టేదీ ఆయననేనా? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి