Minor Girl raped in OYO Room at Hyderabad: 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా.. స్త్రీల పట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించిన వారిని ఎన్‌కౌంటర్ చేసినా.. మృగాళ్ల‌ ధోర‌ణి మాత్రం మార‌డం లేదు. చట్టాలు, ఎన్‌కౌంటర్‌లు తమ‌కు ప‌ట్ట‌వ‌న్నట్టుగా రెచ్చిపోతూనే ఉన్నారు కామాంధులు. చిన్నారులు, మహిళలు అనే విచక్షణ మరిచి అఘాయిత్యాలకు పాల్పడుతూ త‌మ కామవాంఛ తీర్చుకుంటున్నారు. ప్రతిరోజు దేశంలోని ఏదో మూల అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది.


హైదరాబాద్‌ పాతబస్తీలో జరిగిన ఓ సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపుతోంది. చంచల్‌గూడకు చెందిన 13 ఏళ్ల బాలికను అదే ప్రాంతానికి చెందిన యువకులు కిడ్నప్ చేసి కారులో ఎక్కించారు. మాయమాటలు చెప్పి నాంపల్లిలోని ఓయో రూంకు తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. ఓయో రూంలో దుండగలు రెండు రోజుల పాటు బాలికపై అత్యాచారంకు పాల్పడ్డారు. బాలికకు మత్తుమందు ఇచ్చి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. రెండు రోజుల తర్వాత బాలికను ఓయో రూంలో వదిలేసి దుండగలు పారిపోయారు. 


ఓయో రూంలో బాలికను నిస్సాయత స్థితిలో చూసిన సిబ్బంది.. ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. బాలిక విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పి కన్నీరుపెట్టుకుంది. అనంతరం డబీర్‌పుర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలిక ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులను డబీర్‌పుర పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఇద్దరూ బాధితురాలికి తెలిసినవారే కావడం ఇక్కడ విశేషం.


Also Read: ఈరోజు నాకు పిచ్చెక్కిపోతుంది.. ఎలా కలవాలో అర్ధం కావడం లేదు: రష్మిక


Also Read: క్రికెట్‌లో విషాదం.. అంపైర్‌ అసద్‌ రౌఫ్‌ కన్నుమూత! విజయవంతమైన అంపైర్‌గా పేరు కానీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook