Former Pakistan Umpire Asad Rauf Dies due to cardiac arrest: ఐసీసీ, పాకిస్థాన్ మాజీ అంపైర్ అసద్ రవూఫ్ కన్నుమూశారు. గురువారం (సెప్టెంబర్ 15) గుండెపోటుతో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన వయసు 66 ఏళ్లు. అసద్ రవూఫ్ తుదిశ్వాస విడిచినట్టు ఆయన సోదరుడు తాహిర్ రవూఫ్ తెలిపారు. ఈ విషయాన్ని దున్యా న్యూస్ కూడా ధ్రువీకరించింది. అసద్ రవూఫ్ మరణంతో పాకిస్తాన్ క్రికెట్‌లో విషాదం నెలకొంది. పాక్ క్రికెటర్లు మాత్రమే కాకుండా దేశాల ఆటగాళ్లు రవూఫ్ మరణం పట్ల సంతాపం తెలుపుతున్నారు.
తాహిర్ రవూఫ్ అందించిన వివరాల ప్రకారం.. అసద్ రవూఫ్ లాహోర్‌లోని లాండా బజార్‌లో ఓ బట్టల దుకాణం నిర్వహిస్తున్నారు. ఎప్పటిలానే రవూఫ్ బుధవారం రాత్రి దుకాణం మూసివేసి ఇంటికి వెళుతుండగా.. ఛాతీలో నొప్పి వచ్చింది. అసౌకర్యంగా ఉందని చెప్పడంతో.. కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అసద్ రవూఫ్ తుదిశ్వాస విదిశారు.
పాకిస్తాన్ నుంచి అలీమ్ దార్ తర్వాత విజయవంతమైన అంపైర్‌గా అసద్ రవూఫ్ పేరు తెచ్చుకున్నారు. 2006లో రవూఫ్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ అంపైర్‌లలో చేర్చబడ్డారు. 2013లో ఎలైట్ ప్యానెల్ ఆఫ్ అంపైర్ల నుంచి తిలగించబడ్డారు. రవూఫ్ 7 ఏళ్లలో అంతర్జాతీయ క్రికెట్‌లో 170కి పైగా మ్యాచ్‌లకు అంపైరింగ్ చిహ్సారు. ఇందులో 64 టెస్టులు,139 వన్డేలు, 28 టీ20లు ఉన్నాయి. రవూఫ్ తన అంపైరింగ్ ప్రయాణాన్ని 1998లో ప్రారంభించారు. 2000లో పాకిస్తాన్-శ్రీలంక మధ్య జరిగిన వన్డేలో అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. 2004లో మొదటిసారిగా అంతర్జాతీయ అంపైర్ల ప్యానెల్‌లో చేర్చబడ్డారు.
అసద్ రవూఫ్ అంపైర్‌గా మాత్రమే కాకుండా పాకిస్థాన్‌లో ఫస్ట్-క్లాస్ క్రికెటర్‌గా కూడా తనదైన ముద్రవేశారు. 71 ఫస్ట్ క్లాస్ మరియు 40 లిస్ట్ ఎ మ్యాచ్‌లలో మూడు సెంచరీలు 26 అర్ధ సెంచరీల సహాయంతో 3423 మరియు 611 పరుగులు చేశారు. తన కెరీర్‌లో లాహోర్, నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్, పాకిస్తాన్ రైల్వేస్ మరియు పాకిస్తాన్ విశ్వవిద్యాలయాలకు రవూఫ్ ఆడారు. అయితే 2013 ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో అసద్ ఇరుక్కున్నారు. బుకీల నుంచి ఖరీదైన బహుమతుల్ని స్వీకరించి ఫిక్సింగ్‌కి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో బీసీసీఐ విచారణకి ఆదేశించింది. 2016లో దోషిగా తేలడంతో బీసీసీఐ అతనిపై 5 ఏళ్ల నిషేధం విధించింది. ఆపై రవూఫ్ అంపైర్‌గా కొనసాగలేదు.
Also Read: Gold Price Today 15 September: మగువలకు శుభవార్త.. వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధర!
Also Read: Horoscope Today 15 September 2022: ఆ రెండు రాశుల వారికి అధిక ధనవ్యయం తప్పదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook