హైదరాబాద్ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జేబీఎస్ - ఎంజీబీఎస్ మెట్రో రైలు ప్రారంభానికి అనుమతి లభించింది. కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ (సీఎంఆర్ఎస్) 10 కి.మీ ఈ మార్గానికి భద్రత ధ్రువీకరణ పత్రాలు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన తరువాత ఈ మెట్రో ప్రారంభమవుతుంది. బీఎస్ - ఎంజీబీఎస్ మెట్రో పట్టాలెక్కితే హైదరాబాద్ మెట్రో ఫస్ట్ ఫేజ్ 66కి.మీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జేబీఎస్, ఎంజీబీఎస్ లను అనుసంధానం చేస్తూ మెట్రో కారిడార్ 2 నిర్మించారు. జేబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు 15 కి.మీ మేర మెట్రో ప్రతిపాదించినా.. కొన్ని కారణాల వల్ల పాతబస్తీని ఇందులోంచి మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. గత నెలన్నర రోజులుగా ట్రయల్స్ నిర్వహించి.. తొమ్మిది స్టేషన్లకు సంబంధించి విద్యుత్, అగ్నిమాపకశాఖ నుంచి అనుమతి పొందింది. గత మూడు రోజులుగా మెట్రో రైలు భద్రత కమిషనర్ జేకే గార్గ్, మెట్రో, ఎల్ అండ్ టీ మెట్రో ఇంజినీర్లతో కలిసి ఈ మార్గాన్ని పరిశీలించారు. సేఫ్టీ సర్టిఫికెట్‌ను మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ కేవీబీరెడ్డిలకు ఆదివారం అందజేశారు. దీంతో ట్రాఫిక్ కష్టాలు తప్పుతాయని నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Also Read: ‘ఏపీ రాజధాని వివాదం.. తెలంగాణ వ్యాపారికి మేలు’



జేబీఎస్-పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్, ఎంజీబీఎస్.. ఈ మార్గంలోని 9 స్టేసన్లు ఇవి. తాజా మెట్రో రూట్.. ఎల్బీ నగర్-మియాపర్ కారిడార్ 1ని ఎంజీబీఎస్ స్టేషన్ వద్ద, నాగోల్-రాయదుర్గం కారిడార్ 3ని పరేడ్ గ్రౌండ్ వద్ద కలుస్తుందని మెట్రో అధికారులు తెలిపారు.


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..