HMRL Staff Protests: భారతదేశంలోనే రెండవ అతిపెద్ద మెట్రో స్టేషన్ హైదరాబాద్ మెట్రో స్టేషన్.... రెడ్ లైన్, బ్లూ లైన్, గ్రీన్ లైన్స్‌తో ప్రతి నిత్యం రద్దీగా ఉండే మెట్రో లైన్‌పై మెట్రో ఎఫెక్ట్ పడింది. గత ఐదేళ్లుగా మెట్రో లైన్‌తో  సేవలు అందిస్తున్న రెడ్ లైన్ మెట్రో సిబ్బంది ఒక్కసారిగా రోడ్డు పైకి వచ్చి నిరసన గళాన్ని వినిపించారు. ఎల్ బీనగర్ - మియాపూర్ కారిడార్‌లోని 27 మెట్రో స్టేషన్ల టికెటింగ్ సిబ్బంది తమకు సరైన వేతనాలు అందించడం లేదని విధులు బహిష్కరించి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు అమీర్‌పేట మెట్రో స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఐదేళ్లుగా 15 వేల రూపాయల జీతంతో జీవితాలు వెల్లబోస్తున్నామని.. ప్రతి ఏడాది లేబర్ యాక్ట్ కింద 10 % జీతం పెరుగుతుందని ఎదురుచూసి అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకుని వెళ్లిన స్పందన లేకపోవడంతో నేడు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నామని రెడ్ లైన్ మెట్రో లైన్ సిబ్బంది వాపోయారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెయ్యి రూపాయలే పెంచితే ఎలా ?
హైదరాబాద్ మెట్రోకి ప్రధానమైంది రెడ్ లైన్ మెట్రో లైన్. మియాపూర్ టూ ఎల్బినగర్ వరకు నడిచే సర్వీస్‌లు నిలిచిపోవడంతో హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ రద్దీ పెరిగిపోయింది. తమకు ఏళ్లుగా ఉన్న వేతన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ వద్ద బైఠాయించి నిరసనకు దిగారు. వెంటనే స్పందించిన మెట్రో కియోలిస్ సబ్ ఏజెన్సీ నిర్వాహకులు ఆందోనకారులతో చర్చలు జరిపారు. చర్చలు ఎటూ తేలకుండానే టికెటింగ్ సిబ్బంది ఆందోళన విరమించారు. మెట్రో ఏజెన్సీ నిర్వాహకులు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారని.... కానీ ఎంత శాతం అనేది స్పష్టం చేసే వరకు విధులకు హాజరుకామని ఆందోళనకారులు వెల్లడించారు. సుమారు 150 మంది టికెటింగ్ సిబ్బంది అమీర్‌పేట్ స్టేషన్ వద్ద భైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. తమకు 5 ఏళ్లుగా వేతనాలు సరిగా అమలు చేయడం లేదని.....పెంచినా ప్రతి ఏడాది వెయ్యి రూపాయలు మాత్రమే పెంచారని ఉద్యోగులు వాపోయారు. 


స్పష్టమైన హామీ కావాలి..
ఇక లంచ్ బ్రేక్ టైమ్ కూడా కేవలం 15 నిమిషాలు ఇస్తున్నారని.... మెట్రో రైళ్లలో ఉచిత ప్రయాణం కూడా ఇవ్వడం లేదని విన్నవించారు. వేతనాల పెంపుతో పాటు తమ ప్రధానమైన మూడు సమస్యలు పరిష్కరించాలని కోరారు. దీంతో దిగివచ్చిన మెట్రో కియోలిస్ సబ్ ఏజెన్సీ నిర్వాహకులు ఆందోళన చేస్తున్న ఉద్యోగులతో అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో చర్చలు నిర్వహించారు. ఆందోళన చేస్తున్న ఐదుగురు టికెట్  సిబ్బందితో చర్చలు జరిపారు. చర్చల తర్వాత ప్రస్తుతం ధర్నా విరమిస్తున్నట్లు ఉద్యోగులు ప్రకటించారు. కియోలిస్ ఏజెన్సీ నిర్వహకులు వేతనాల పెంపుపై ఉన్నతాధికారులతో చర్చించి చెబుతామన్నారు. వేతనాలు పెంచాలని ప్రధానంగా డిమాండ్ చేసినట్లు మెట్రో టిక్కెటింగ్  సిబ్బంది వెల్లడించారు. మరోసారి చర్చలకు రమ్మన్నారని... మరోసారి చర్చించిన తర్వాత తమ నిర్ణయం వెల్లడిస్తామని తెలిపారు. స్పష్టమైన హామీ వచ్చేవరకు తాము విధులకు హాజరుకామని మెట్రో టిక్కెటింగ్ సిబ్బంది తెలిపారు. ఉదయం నుంచి ఉద్యోగుల ఆందోళనతో ఎల్బీనగర్ - మియాపూర్ మెట్రో స్టేషన్లలో కొంత మేరకు పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. టికెట్లు ఇచ్చే సిబ్బంది విధులకు హాజరుకాకపోవడంతో అక్కడక్కడ కొన్ని స్టేషన్ల వద్ద భారీగా ప్రయాణికులు బారులు తీరారు. మెట్రో ప్రయాణికులు కొంత వరకు అసౌకర్యానికి గురయ్యారు. దీంతో అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. 


సిబ్బంది ఆరోపణలను తిప్పికొట్టిన హైదరాబాద్ మెట్రో రైలు నిర్వాహకులు
మెట్రో టికెటింగ్ సిబ్బంది ఆందోళనపై హైదరాబాద్ మెట్రో వర్గాలు స్పందించాయి. రైళ్లు రాకపోకలు నిలిపివేసేందుకే సిబ్బంది విధుల్లోకి రాలేదని... సిబ్బంది వ్యవహరించిన తీరు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని ఎల్ అంట్ టి మేనేజ్మంట్ వర్గాలు వివరణ ఇచ్చాయి. టికెటింగ్ సిబ్బంది చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని... ధర్నా చేస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఎల్ అండ్ టి వర్గాలు స్పష్టంచేశాయి. నగరంలో సమయం ప్రకారం మెట్రో రైళ్లు నడుస్తున్నాయని.. రైళ్ల రాకపోకలపై సిబ్బంది ధర్నా ప్రభావం ఏమాత్రం లేదని అధికారులు పేర్కొన్నారు.


ఇది కూడా చదవండి : Thief Sleeping: దొంగతనానికి వచ్చి తాపీగా నిద్రపోయిన దొంగ.. చివరికి ఊహించని ట్విస్ట్


ఇది కూడా చదవండి : Navodaya Notification: నవోదయ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. ఆ రోజే లాస్ట్


ఇది కూడా చదవండి : Revanth Reddy Slams KCR: 35 వేల కోట్లు దోచిన గజదొంగ కేసీఆర్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook