TSRTC bus timings, Hyderabad metro timings changed: హైదరాబాద్: తెలంగాణలో గురువారం జూన్ 10 నుంచి లాక్‌డౌన్‌ పొడిగింపుతో పాటు లాక్‌డౌన్ వేళల్లో మార్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో హైదరాబాద్‌ మెట్రో రైళ్ల వేళల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదయం 7 గంటలకు మొదటి మెట్రో రైలుతో ప్రారంభమయ్యే మెట్రో రైలు సేవలు సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉండనున్నాయి. సాయంత్రం 5 గంటలకు చివరి మెట్రో రైలు బయల్దేరి సాయంత్రం 6 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటాయని హైదరాబాద్ మెట్రో రైలు (HMRL) అధికారులు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : TS inter second year exams: తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దుపై మరో ప్రకటన


ఇదిలావుంటే, మరోవైపు టీఎస్ఆర్టీసీ బస్సుల సమయాల్లోనూ మార్పులు చేసినట్టు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. లాక్‌డౌన్ వేళల్లో మార్పులు (Telangana lockdown timings) దృష్ట్యా ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా సాయంత్రం 6 గంటల వరకు బస్సులు (TSRTC bus timings during lockdown) అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్టు ఆర్టీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.


Also read : Good news for farmers: రైతులకు గుడ్ న్యూస్.. ఖరీఫ్ పంటలకు MSP పెంచిన కేంద్రం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook