MSP for Kharif crops hiked, price list of crops: న్యూ ఢిల్లీ: ఖరీఫ్ సాగుకు సిద్ధమైన రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఖరీఫ్ పంటలకు కనీస మద్ధతు ధరలు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం గురించి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ థోమర్ మీడియాకు వెల్లడించారు. నరేంద్ర సింగ్ థోమర్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రైతులకు ఆదాయం పెంచి వ్యవసాయాన్ని లాభసాటి చేసేందుకు కేంద్రం అహర్నిషలు కృషి చేస్తోంది అని అన్నారు.
కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ థోమర్ వెల్లడించిన వివరాల ప్రకారం క్వింటాల్ వరికి (Paddy MSP) రూ. 72 మద్దతు ధర పెంచారు. దీంతో ఇప్పటివరకు రూ.1868 గా ఉన్న వరి ఇకపై రూ.1940కి పెరగనుంది. మిల్లెట్స్ కి (Millets MSP) రూ. 2150 గా ఉన్న కనీస మద్దతు ధరను రూ.2250 కి పెంచారు. అత్యధికంగా నువ్వులు (sesame seeds MSP) క్వింటాలుకి రూ. 452 పెంచారు. అలాగే కందులు (Tur MSP), మినుములు క్వింటాలుకు రూ.300 చొప్పున (Urad MSP), వేరుసెనగకు (Groundnut MSP) రూ. 275, వెర్రి నువ్వులు క్వింటాలుకి (Niger seeds) రూ.235 చొప్పున కనీస మద్ధతు ధరలు పెరిగాయి. రైతులకు (Farmers) వారు పండించే పంటలపై ఆదాయం పెంచేందుకే కేంద్రం కనీస మద్దతు ధరలు పెంచినట్టు కేంద్ర మంత్రి స్పష్టంచేశారు.
Also read: TS Cabinet meeting important points:తెలంగాణ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు
కనీస మద్ధతు ధరల పెంపు అనంతరం పలు ఖరీఫ్ పంటల ధరలు ఇలా ఉండనున్నాయి:
వరి క్వింటాలుకు రూ. 1940.
మిల్లెట్స్ క్వింటాలుకు రూ. 2250
కందులు క్వింటాలుకు రూ. 6300
మినుములు క్వింటాలుకు రూ. 6300
Also read : Dharani portal సమస్యలపై ఫిర్యాదు చేయాలా ? ఇదిగో whatsapp number
Also read: Digital survey: తెలంగాణలో వ్యవసాయ భూముల డిజిటల్ సర్వే లేటెస్ట్ అప్‌డేట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook