Asaduddin Owaisi: రాజకీయ ఊసరవెల్లి అనే పదం హైదరాబాద్ కు చెందిన పతంగ్ పార్టీకి అచ్చంగా సరిపోతుంది. అధికారంలో ఏ పార్టీ ఉంటే  ఆ పార్టీ అంటకాగుతుంది. 2014 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించింది. ఒక్క కిరణ్ కుమార్ రెడ్డి విషయంలో మాత్రం ఆ పార్టీకి కాస్త విభేదాలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడనంత వరకు తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా తన వాదనలు వినిపంచినా.. 2014 ఎన్నికల్లో కేసీఆర్  నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి మిత్రపక్షంగా వ్యవహరిస్తూ వచ్చింది. ఆ పార్టీతో ఉన్న మిత్రత్వం కారణంగా సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించలేకపోయింది అధికార పార్టీ. దీంతో గులాబీ బాస్ కు ఎంత డ్యామేజీ కావాలో అంత అయింది. కట్ చేస్తే 2023 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాంగ్రెస్ పార్టీ అలవి కానీ హామిలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అవి పూర్తి స్థాయిలో అమలు చేయలేక హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తుందని ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు గ్రౌండ్ లెవల్లో చెబుతున్న మాట. హైడ్రా పేరుతో పెద్దలను విడిచిపెట్టి.. పేద, మధ్య తరగతి ప్రజలపై విరుచుకు పడటం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.


ఒక రకంగా హైడ్రా పేరుతో హైదరాబాద్ కు పూర్వ వైభవం తేవాలన్న రేవంత్ సర్కార్ నిర్ణయం మెచ్చుకోవాల్సిన విషయమే. కానీ అందుకు ప్రజలను ముందుగా ఒప్పించి తగిన పరిహారంతో పాటు పునరావాసం కల్పించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటే బాగుండేదనే అందరు చెబుతున్నారు. తాజాగా హైడ్రాపై పతంగ్ పార్టీ ఛీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల ఇళ్ల కూల్చివేతపై పునరాలోచించాలని సూచించారు.. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉండే వాటిని కూల్చాల్సి వస్తే ముందు ప్రభుత్వ కార్యాలయాలే అనేకం ఉన్నాయన్నారు.


ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..


ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..


తెలంగాణ సచివాలయం, ఐమాక్య్ పాటు, మింట్ కంపౌండ్, విద్యుత్  సహా పలు ప్రభుత్వ  కార్యాలయాలు FTL పరిధిలోనే ఉందన్నారు. అలాగే దేశంలోని ప్రముఖుల సమాధులన్నీ FTL పరిధిలోనే ఉన్నాయన్నారు. చివరికి బాపూఘాట్‌ కూడా FTL పరిధిలోనే ఉందన్నారు. ఇవన్నీ FTL పరిధిలో ఉన్నప్పుడు పేదల ఇళ్లు ఉంటే తప్పేంటని అసదుద్దీన్‌ ప్రశ్నించారు. 2013లో కాంగ్రెస్ తెచ్చిన భూచట్టం ప్రకారం కూల్చివేతలపై సర్కార్ ముందుకెళ్లాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలని హితవు పలికారు.


ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..


ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter