Panjagutta girl murder: పంజాగుట్ట బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ.. తల్లే చంపేసింది
హైదరాబాద్ లోని పంజాగుట్టలో జరిగిన బాలిక హత్య కేసులో చిన్నారి తల్లితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ సంబంధానికి (Illegal affair) అడ్డుగా ఉందనే కారణంతోనే తల్లే కూతురును హత్య చేసిందని పోలీసులు స్పష్టం చేశారు.
Hyderabad panjagutta girl murder mystery Mother is the accused in punjagutta girl murder case: హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట బాలిక హత్య కేసును (punjagutta girl murder case) పోలీసులు చేధించారు. కొద్దిరోజులుగా మిస్టరీగా మారిన పంజాగుట్ట బాలిక హత్య కేసును నిందితులను తేల్చేశారు.
హైదరాబాద్ లోని పంజాగుట్టలో జరిగిన బాలిక హత్య కేసులో చిన్నారి తల్లితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ సంబంధానికి (Illegal affair) అడ్డుగా ఉందనే కారణంతోనే తల్లే కూతురును హత్య చేసిందని పోలీసులు స్పష్టం చేశారు.
రాజస్థాన్‌లోని అజ్మీర్ లో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాగుట్టలోని ద్వారకాపురికాలనీలో (Dwarkapuri Colony in Panjagutta) ఒక షాప్ ఎదుట కొన్ని రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో ఒక చిన్నారి మృతదేహం (Dead body) పోలీసులకు లభించింది. అప్పటి నుంచి పోలీసులు ఈ మిస్టరీని ఛేదించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించారు. చివరకు హంతకులను పట్టుకున్నారు.
Also Read :Watch Video: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అగ్ని ప్రమాదం
ఘటనా స్థలానికి కొంత దూరంలో లభించిన కీలకాధారంతో నిందితులను గుర్తించగలిగారు. ఇక ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను కాసేపట్లో మీడియాకు పోలీసులు (Police) తెలపనున్నారు.అయితే ఈ కేసుకు సంబంధించి వివరాలను ఒక ప్రకటనగా రూపొందించి తెలుగు రాష్ట్రాలతో (Telugu states) పాటు, కర్ణాటక, మహారాష్ట్రలకు (Karnataka, Maharashtra) పంపించారు పోలీసులు. అలాగే సోషల్ మీడియాలో కూడా చిన్నారి ఫోటోను పోస్ట్ చేశారు. ప్రత్యేకంగా పోలీస్ బలగాలను ఏర్పాటు చేసి ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
సీసీ కెమెరాలను (CCTV cameras) పరిశీలిస్తుండగా తాజాగా ఒక కీలకాధారం పోలీసులకు లభించింది. నిందితులు అజ్మీర్‌లో ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్లారు. వారు పాతబస్తీకి (Old town) చెందిన వారిగా గుర్తించారు. బాలిక తండ్రి చనిపోవడంతో ఆమె తల్లి.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం (Extramarital affair) కొనసాగిస్తోందని.. వారు యాచకులని ఈ కేసు (Case) దర్యాప్తులో తేలింది.
Also Read :Norovirus: నిన్న కరోనా..ఈ రోజు నోరో వైరస్..భయం గుప్పిట్లో కేరళ.. లక్షణాలు, చికిత్స
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook