Panjagutta girl murder: వివాహేత‌ర సంబంధ‌ వల్లే పంజాగుట్ట బాలిక హ‌త్య

 punjagutta girl murder case:  చిన్నారి హ‌త్య కేసులో పంజాగుట్ట పోలీసులు ఇద్ద‌రిని అరెస్టు చేశారు. ఒక మ‌హిళ‌తో పాటు మ‌రో వ్య‌క్తిని క‌ర్ణాట‌క‌లో అరెస్టు చేసి హైద‌రాబాద్‌కు (Hyderabad) తీసుకొచ్చారు. అయితే ఆ చిన్నారి హ‌త్య‌కు (Child murder) వివాహేత‌ర సంబంధ‌మే (extramarital affair) కార‌ణ‌మ‌ని పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 12, 2021, 03:45 PM IST
  • హైద‌రాబాద్ పంజాగుట్టలో బాలిక మృతదేహం లభ్యం కేసులో పురోగ‌తి
  • ఇద్ద‌రిని అరెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులు
  • బాలికను సొంత తల్లే హత్య చేసిందని, హత్యకు వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమికంగా నిర్ధారణ
Panjagutta girl murder: వివాహేత‌ర సంబంధ‌ వల్లే పంజాగుట్ట బాలిక హ‌త్య

Hyderabad panjagutta girl murder mystery 2 persons arrested in punjagutta girl murder case: హైద‌రాబాద్ పంజాగుట్టలో బాలిక మృతదేహం లభ్యం కేసులో పురోగ‌తి ల‌భించింది. చిన్నారి హ‌త్య కేసులో పంజాగుట్ట పోలీసులు ఇద్ద‌రిని అరెస్టు చేశారు. ఒక మ‌హిళ‌తో పాటు మ‌రో వ్య‌క్తిని క‌ర్ణాట‌క‌లో అరెస్టు చేసి హైద‌రాబాద్‌కు (Hyderabad) తీసుకొచ్చారు. అయితే ఆ చిన్నారి హ‌త్య‌కు (Child murder) వివాహేత‌ర సంబంధ‌మే (extramarital affair) కార‌ణ‌మ‌ని పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు.

పంజాగుట్టలోని ద్వారకాపురికాలనీలో (Dwarkapuri Colony) ఒక షట్టర్‌ గది వద్ద ఈ నెల 4న‌ ఉదయం ఓ బాలిక మృతదేహం లభించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం (Postmortem) నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు (Gandhi Hospital‌) తీసుకెళ్లగా.. బాలిక ఒంటిపై గాయాలు ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేప‌ట్టారు.

బాలిక ముఖంపై కమిలిన గాయాలతో పాటు కుడి చేయి విరిచినట్లు ఉండటంతో హత్య (Murder) జరిగి ఉంటుందని పోలీసులు భావించారు. బాలిక ఒంటిపై పాత గాయాలు కూడా ఉండడంతో ఆ చిన్నారిని చాలా రోజులు చిత్ర హింసలకు గురి చేసి చంపేశారని పోలీసులు నిర్ధారించారు.

పాపను వేరే ప్రాంతంలో హత్య చేసి మృతదేహాన్ని హైద‌రాబాద్ పంజాగుట్టలో (Hyderabad Panjagutta) పడేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పాటు పాప కడుపులో, వీపులో బలంగా దెబ్బలున్నాయని, భుజం వద్ద వెముక విరిగినట్లు పోస్టుమార్టంలో తేలింది.

Also Read : Atmakur SI lingam attach to vr : గిరిజన యువకుడి కేసులో ఎస్ఐ లింగంపై బ‌దిలీ వేటు

అయితే ఈ కేసును చేధించేందుకు ఎనిమిది పోలీసులు బృందాలు రంగంలోకి దిగాయి. ఘటనా స్థలం, పరిసర ప్రాంతాల్లోని 100 సీసీ కెమెరాలను (100 cc cameras) పరిశీలించారు. ఆ రూట్‌లో వెళ్లిన దాదాపు 120 ఆటోలను కూడా పోలీసులు పరిశీలించారు. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు లేవు. ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీంచారు.

ఇక బాలికను సొంత తల్లే హత్య చేసిందని, ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. బాలికను బెంగళూరులో (Bangalore) చంపిన కసాయి తల్లి హైదరాబాద్‌కు తీసుకువచ్చి పంజాగుట్టలో పడేసినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు (Case) సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read : Flex Fuel Engines: గుడ్ న్యూస్..తగ్గనున్న పెట్రో-డీజిల్ ధరలు..లీటర్‌కు రూ.62: గడ్కరీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News