1500 మంది అతిథులకు భద్రత; పోలీసులకు పెద్ద సవాల్
సమ్మిట్ నుండి అతిథులను 45 బస్సుల్లో ఫలక్ నూమా ప్యాలెస్ కు తరలించనున్నారు. తొలుత ప్రధాని మోదీ కాణ్వాయ్.. తరువాత ఇవాంకా కాణ్వాయ్ ను ఆపై సీఎం కేసీఆర్ కాణ్వాయ్, కేంద్ర మంత్రుల కాణ్వాయ్ ను అనుమతించి.. అతిథులను తీసుకువెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇవాంకా ట్రంప్, కేంద్ర మంత్రులు, 170 మంది విదేశీ ప్రముఖులు వస్తున్నవేళ హైద్రాబాద్ లో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటయింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా రాష్ట్ర పోలీస్ లు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దాదాపు హైదరాబాద్ మొత్తం పోలీసులు జల్లెడ పట్టారంటే.. ఎంత కట్టుదిట్టమైన భద్రత ఉందో ఈ పాటికే తెలిసి ఉంటుంది. అయితే.. హెచ్ఐసీసీలో మొదటిరోజు సమ్మిట్ ముగిసిన తరువాత ఫలక్ నూమా ప్యాలెస్ లో భారత ప్రభుత్వం విందు ఇవ్వనున్న సంగతి తెలిసిందే..! ఇదే పోలీసులకు పెద్ద సవాల్ గా నిలిచింది. సమ్మిట్ నుండి ప్రముఖులను పాతబస్తీ ప్యాలెస్ కు తరలించడమే వీరిముందున్న సవాల్.
సమ్మిట్ నుండి అతిథులను 45 బస్సుల్లో ఫలక్ నూమా ప్యాలెస్ కు తరలించనున్నారు. తొలుత ప్రధాని మోదీ కాణ్వాయ్.. తరువాత ఇవాంకా కాణ్వాయ్ ను ఆపై సీఎం కేసీఆర్ కాణ్వాయ్, కేంద్ర మంత్రుల కాణ్వాయ్ ను అనుమతించి.. అతిథులను తీసుకువెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు. ప్రయాణ సమయం 40 నిమిషాలు. సాయంత్రము 6 నుండి రాత్రి 8 గంటలవరకు, ఆపై 9 నుండి 11 గంటలవరకు ప్రజలు ట్రాఫిక్ ఇక్కట్లకు గురికాకతప్పదు.