Ys Sharmila Hunger Strike: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శనివారం అర్ధరాత్రి హైడ్రామా నడుమ పోలీసులు భగ్నం చేశారు. ఆరోగ్యం క్షీణిస్తుండడంతో అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో దీక్షా శిబిరం నుంచి జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. లోటస్‌పాండ్ వద్ద ఆమెను ఆసుపత్రి తీసుకెళ్లే సమయంలో భారీగా కార్యకర్తలు తరలిరాగా.. పోలీసులు ఎక్కడిక్కడే అరెస్ట్ చేశారు. షర్మిల ఆరోగ్యం క్షీణిస్తోందని వైద్యుల సూచన మేరకు పోలీసులు దీక్షను భగ్నం చేసి వెంటనే ఆసుపత్రికి తరలించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అపో ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కార్యకర్తలను ఆసుపత్రి పరిసరా ప్రాంతాల్లోకి వెళ్లకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేసి అడ్డుకుంటున్నారు. వైఎస్ విజయమ్మ అపోలో ఆసుపత్రికి చేరుకుని.. షర్మిలను పరామర్శించారు. ఆమె రెండు రోజుల పాటు మంచినీళ్లు కూడా తీసుకోకపోవడంతో ఆరోగ్యం బాగా క్షీణించినట్లు వైద్యులు చెబుతున్నారు. బీపీ, గ్లూకోజ్ లెవల్స్ భారీగా పడిపోయినట్లు వెల్లడించారు. ప్రస్తుతం అపోలో హాస్పటల్లోని ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 


వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వని విషయం తెలిసిందే. పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వాలని.. అరెస్ట్ చేసిన తమ పార్టీ కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్క్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం అక్కడే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. పోలీసులు అక్కడి నుంచి ఆమెను లోటస్‌పాండ్‌కు తరలించగా.. అక్కడే దీక్షను కొనసాగించారు. 


పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వాలని.. అరెస్ట్ చేసిన తమ పార్టీ కార్యకర్తలను విడిచిపెట్టే వరకు దీక్షను విరమించేది లేదని షర్మిల స్పష్టంచేశారు. పోలీసులు కేసీఆర్ చేతిలో కీలుబొమ్మలుగా మారారని.. ఖాకీ చొక్కాలు వేసుకొని తిరిగే బీఆర్ఎస్ కార్యకర్తలు అంటూ ఫైర్ అయ్యారు. ఇండియన్ పీనల్ కోడ్ ఈ పోలీసులకు వర్తించదని.. కల్వకుంట్ల కమీషన్ రావు రాసిన కొట్టి చంపే కోడ్ ఒక్కటే వీరికి శిలాశాసనమన్నారు. ప్రశ్నించే అధికారం, నిరసనలు తెలిపే హక్కు ఉందని తెలిసినా.. ఇవేమీ ఈ ఖాకీలకు పట్టవన్నారు.


'దీక్షకు వచ్చే పార్టీ శ్రేణులను మెడ పట్టి ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేస్తున్నారు. స్టేషన్లో కొట్టి, దుర్భాషలాడుతున్నారు. నన్ను చూసేందుకు వస్తున్న కుటుంబ సభ్యులను సైతం రానివ్వడం లేదు. ఇది ప్రజాస్వామ్య రాష్ట్రమా..? నియంత రాజ్యమా..? ప్రశ్నించే గొంతుకను అష్టదిగ్బంధనం చేసి  చంపే కుట్ర పన్నారా..?' అంటూ షర్మిల ఫైర్ అయ్యారు. శనివారం ఆమెను పరీక్షించిన వైద్యులు.. ఆరోగ్యం క్షీణించిందని చెప్పడంతో అర్ధరాత్రి పోలీసులు దీక్షను భగ్నం చేశారు. 


Also Read: Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్‌ సినిమాకు టైటిల్ మార్పు.. 'ఉస్తాద్ భగత్ సింగ్'గా వస్తున్న పవర్ స్టార్  


Also Read: TS Govt Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. శాఖల వారీగా భర్తీ చేసే పోస్టులు ఇవే..  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook