MLA Raja Singh: హనుమాన్ జయంతికి ముందు బిగ్ షాక్.. ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు..
MLA Raja Singh: గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు కేసునమోదు చేశారు. శ్రీరామనవమి శోభయాత్రలో రాజాసింగ్ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. దీంతో సుల్తాన్ బజార్ పోలీసులు సుమోటోగా కేసును నమోదు చేసినట్లు సమాచారం.
Sultan bazar Police Fileld Case On MLA Rajasingh On Violating Election Code: హనుమాన్ జయంతికి ముందు బీజేపీకి బిగ్ షాక్ తగిలిందని చెప్పుకొవచ్చు.కేంద్ర ఎన్నికల సంఘటం. నాలుగు రాష్ట్రాలు, లోక్ సభస్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. దీంతో ఒక్కసారిగా ఎన్నికల కోడ్ దేశంలో అమల్లోకి వచ్చింది. ఈక్రమంలో ఎన్నికల నియామవళి ప్రకారం.. ఎన్నికల ప్రచారంలో నాయకులు, కొన్ని నియమామవళిని తప్పకుండా పాటించాలి. ఎన్నికల ప్రచారంలో డబ్బులు, మద్యం పంచకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తుంటారు. ఎవరైన నేతలు రెచ్చగొట్టేలా ప్రచారం నిర్వహిస్తే, ఎన్నికల సంఘం వీరిపై కేసులునమోదు చేస్తుంది. అదేవిధంగా ఎన్నికలు రాగానే.. నేతలు సీక్రెట్ గా తమకు ఓటు వేయాలని ప్రజలకు ప్రలోభాలకు గురిచేస్తుంటారు. మద్యం, డబ్బులను సరఫరా చేస్తుంటారు.
కొందరు చీరలు, ఫర్నీచర్ ఐటమ్స్ లను ఇస్తుంటారు. ఈ క్రమంలో పోలీసులు ఎక్కడ కూడానేతలు వివాదస్ప ద వ్యాఖ్యలు చేసిన, డబ్బులు పంచడానికి ప్రయత్నించిన, ఓటర్లకు ప్రలోభలాకు గురిచేయాలని చూసిన డెగకళ్లతో గమనిస్తుంటారు. అంతేకాకుండా నిరంతరం శాంతి భద్రతలను చూస్తూ, ఎన్నికలు సజావుగానే సాగేలా చర్యలు తీసుకుంటారు. ఇదిలా ఉండగా.. ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా.. హైదరాబాద్ లోని గోషామహల్ లో రామయ్య శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలో ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు.
హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభయాత్ర అంటే.. ముందుగా అందరికి రాజాసింగ్ గుర్తుకు వస్తారు. ఆయన హిందిలో పాటలు పాడుతూ, బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తుంటారు. కొందరు ఆయన పాటలకు ఫిదా అయి ప్రచారంలో పాల్గొంటారు. ఈ క్రమంలో రాజాసింగ్ ఇటీవల జరిగిన శ్రీరాముడి శోభాయాత్రలో పాల్గొనప్పుడు ఎన్నికల నియామవళిని ఉల్లంఘించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న సుల్లాన్ నగర్ పోలీసులు రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు.
హనుమాన్ జయంతికి ఒక రోజు ముందు ఈ ఘటన జరగటంతో ఆయన ఫ్యాన్స్, తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, మంగళవారం దేశ వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ రోజు అనేక చోట్ల హనుమాన్ విజయోత్సవ ర్యాలీలను నిర్వహిస్తారు. ఈ ర్యాలీలో కూడా ఎమ్మెల్యే రాజాసింగ్ ఫుల్ జోష్ తో పాల్గొంటారు. ఈ కేసునమోదుతో ఆయన మాత్రం ఏ విధంగా స్పందిస్తారో తెలియడానికి మరికొంత సమయం వేచిచూడాల్సిన అవసరం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter