PD ACT: హైదరాబాద్ పోలీసులు మరో పీడీ యాక్ట్ కేసు నమోదు చేశారు. గత గురువారం రోజున గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ పెట్టిన పోలీసులు... ఎమ్మెల్యేను చర్లపల్లి జైలుకు తరలించారు. తాజాగా పాతబస్తీకి చెందిన ఎంఐఎం నేత కషఫ్ పై పీడీ యాక్ట్ పెట్టారు.  ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వీడియో  హైదరాబాద్ తో పాటు దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. రాజాసింగ్ వ్యాఖ్యలపై ఓ యూట్యాబ్ ఛానెల్ లో ఎంఐఎం  నేత కషఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కషఫ్ చేసిన కామెంట్లు రెండు వర్గాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని గుర్తించిన పోలీసులు.. అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. కషప్ ను అదుపులోనికి తీసుకున్న పోలీసులు ఉస్మానియా హాస్పిటల్ లో వైద్య పరీక్షలు తర్వాత చంచల్ గూడ జైలుకు తరలించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు పీడీ యాక్ట్ ను రివోక్ చేయాలంటూ గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కుటుంబం న్యాయ‌ పోరాటానికి సిద్ధ‌మ‌వుతున్నారు. పీడీ యాక్ట్ ర‌ద్దు చేయాల‌ని కోరుతూ తెలంగాణ హైకోర్టులో గురువారం  పిటిష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారని తెలుస్తోంది. గత ఫిబ్రవరిలో నమోదైన కేసును పోలీసులు చెప్పారు. దీంతో ఆరు నెల‌ల క్రితం న‌మోదైన కేసులో ఇప్పుడు పీడీ యాక్ట్ ప్ర‌యోగించ‌డం ఏంట‌ని రాజాసింగ్ త‌ర‌పు న్యాయ‌వాదులు ప్ర‌శ్నిస్తున్నారు. అయితే పీడీయాక్ట్ తొల‌గించాలంటే అడ్వైజ‌ర్ క‌మిటీనే కీలకమని తెలుస్తోంది. త్వరలోనే పీడీ యాక్ట్  అడ్వైజ‌ర్ క‌మిటీ రాజాసింగ్ ను విచారించనుంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి