Rain In Hyderabad Today: హైదరాబాద్‌లో భారీ వర్షాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం
Rain In Hyderabad today: వాతావారణ శాఖ సూచించినట్లుగానే తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో గత రెండు మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
Rain In Hyderabad : నైరుతు రుతుపవనాలు, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం కారణంగా హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వాతావారణ శాఖ సూచించినట్లుగానే తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో గత రెండు మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు దిగొచ్చి వాతావరణం చల్లబడింది.
నగరంలోని దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, చైతన్యపురి, మీర్‌పేట్, సరూర్ నగర్, మలక్‌పేట, వనస్థలిపురం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, యూసఫ్‌గూడ, క్రిష్ణానగర్, పంజాగుట్ట, కూకట్పల్లి, జీడిమెట్ల, మసబ్ ట్యాంక్, మెహిదీపట్నం, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, నాచారం, నల్లకుంట సహా Hyderabad లోని పలుచోట్ల నేటి ఉదయం నుంచి భారీగా వర్షం కురుస్తోంది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీటి కారణంగా ట్రాఫిక్ జామ్ కావడంతో పలు చోట్ల వాహనదారుల రాకపోకలకు అంతరాయం తలెత్తింది.
Also Read: EPFO Alert: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త, జాబ్ కోల్పోయినా COVID-19 అడ్వాన్స్ నగదు సాయం
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పడీనం ఉపరితల ఆవర్తనంగా మారడంతో తెలంగాణ(Telangana)లో రానున్న రెండు, మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌తో పాటు కొన్ని జిల్లాల్లోనూ సోమవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నట్లు సమాచారం.
Also Read: Petrol Price Today: హైదరాబాద్‌లో సెంచరీ కొట్టిన పెట్రోల్ ధర, డీజిల్ దూకుడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook