KCR review on Palle Pragathi: పల్లె, పట్టణ ప్రగతి పురోగతితో పాటు భవిష్యత్ కార్యాచరణపై అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, ఉన్నతాధికారులతో తెలంగాణ సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు. పల్లె ప్రగతిపై అధికారుల పనితీరు, నిధుల వినియోగం లాంటి అంశాలు చర్చించేందుకు ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు.
వర్షాకాలం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పల్లెలతో పాటు పట్టణాలలో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యాత ఇవ్వాలని చర్చించారు. ఇందుకోసం గ్రామాలు, పట్టణాలకు తెలంగాణ బడ్జెట్‌లో కేటాయింపులు చేసి నిధులు విడుదల చేస్తున్నారు. రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లక్ష్యాలు, సాధించిన విజయాలు, భవిష్యత్ కార్యాచరణపై సీఎం కేసీఆర్ (Telangana CM KCR) సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఈ పనులకు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటికల నిర్మాణం, పట్టణాలలో మార్కెట్ల నిర్మాణం ఏ మేరకు జరుగుతుందన్న వివరాలు తెలుసుకుని, అధికారులకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తున్నారు.
Also Read; EPFO Alert: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త, జాబ్ కోల్పోయినా COVID-19 అడ్వాన్స్ నగదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook