Heavy Rains in Hyderabad: హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్‌, మ‌ల్కాజ్‌గిరి, మౌలాలి, కాప్రా, బేగంపేట్, బోయిన్‌ప‌ల్లి, రాంన‌గ‌ర్, ఉస్మానియా యూనివర్శిటీ, తార్నాక‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, సోమాజీగూడ, పంజాగుట్ట, ఖైర‌తాబాద్‌, కూక‌ట్‌ప‌ల్లి, కేపీహెచ్‌బీ కాల‌నీ, బాలాన‌గ‌ర్‌, మియాపూర్‌, ప్ర‌గ‌తి న‌గ‌ర్‌, నిజాంపేట్‌‌తో పాటు ప‌లు ఇతర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నగరంలోని ఇంకొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు జల్లులు కురిశాయి. గత రెండు, మూడు రోజులుగా ఎండలు ఎండాకాలాన్ని తలపిస్తుండటంతో అనుకోకుండా కురిసిన వర్షానికి నగరం చల్లబడింది. ఎండ వేడి నుంచి నగరవాసులకు కొంత ఉపశమనం లభించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలావుంటే, హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోనూ కొన్ని చోట్ల ఇవాళ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా కామారెడ్డి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, హన్మకొండ, వరంగల్, నారాయణపేట, సూర్యాపేట, మహబూబాబాద్, మంచిర్యాల, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇవాళ సాయంత్రం వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాతావరణ కేంద్రం అధికారులు చెప్పినట్టుగానే పలు జిల్లాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains in Telangana ) కురిశాయి.


Also Read : Kaleshwaram Project: కాళేశ్వరం అద్భుతం అన్నారు.. మరి ఇప్పుడేమైంది ? కేంద్రానికి తెలంగాణ మంత్రులు ప్రశ్నల వర్షం


Also Read : Ponguleti Srinivas Reddy: టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాకిచ్చిన ఈటల.. బీజేపీలోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3P2DgvH


Apple Link - https://apple.co/3df6gDq


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook