Kaleshwaram Project: కాళేశ్వరం అద్భుతం అన్నారు.. మరి ఇప్పుడేమైంది ? కేంద్రానికి తెలంగాణ మంత్రులు ప్రశ్నల వర్షం

Kaleshwaram Project Pump House Issue: కేంద్ర మంత్రి షేకావత్‌పై మంత్రులు టి. హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ నిప్పులు చెరిగారు. కేంద్ర మంత్రి షేకావత్ నిన్న మాట్లాడిన తీరు చాలా బాధ్యతా రాహిత్యంగా ఉందని... మంత్రి వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని అన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 18, 2022, 08:09 PM IST
Kaleshwaram Project: కాళేశ్వరం అద్భుతం అన్నారు.. మరి ఇప్పుడేమైంది ? కేంద్రానికి తెలంగాణ మంత్రులు ప్రశ్నల వర్షం

Kaleshwaram Project Pump House Issue: కేంద్ర మంత్రి షేకావత్‌పై మంత్రులు టి. హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ నిప్పులు చెరిగారు. కేంద్ర మంత్రి షేకావత్ నిన్న మాట్లాడిన తీరు చాలా బాధ్యతా రాహిత్యంగా ఉందని... మంత్రి వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే దేనికైనా సై.. ఒకవేళ ప్రశ్నిస్తే ఏదైనా నై అన్నట్టుగా బీజేపీ వ్యవహారం ఉందని మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ కేంద్రాన్ని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును, కేంద్రం నిజ స్వరూపాన్ని సీఎం కేసీఆర్ ఎండగడుతుంటే బీజేపీ నేతలకు కడుపుమండుతోందన్నారు. గతంలో మెచ్చు కున్న నోళ్లతోనే ఇప్పుడు పుచ్చిపోయిన మాటలు మాట్లాడుతున్నారు. కాళేశ్వరానికి కితాబిచ్చిన కేంద్రంలోని బీజేపి నేతలే ఇపుడు ఏదో మతలబు ఉందని అంటున్నారు. ఒకసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి చూస్తే అప్పుడు మీరు పార్లమెంటు సాక్షిగా కాళేశ్వరం గురించి చెప్పిన మాటలు గుర్తుకొస్తాయని.. అప్పుడు చెప్పిన నిజాలను ఇపుడు అబద్దాలుగా ప్రచారం చేస్తున్నారంటే బీజేపీకి చట్ట సభలు ఎంత చులకనగా మారాయో ఇట్టే అర్థమవుతోందని అన్నారు. 

అవినీతి జరిగితే అనుమతులు ఎలా ఇచ్చారు
కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులిచ్చినప్పుడు, అప్పులు ఇచ్చినప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకొస్తున్నాయని మంత్రులు కేంద్రాన్ని ప్రశ్నించారు. మీకు నచ్చినప్పుడు నీతిగా ఉందని... నచ్చనపుడు అవినీతి అని అంటారా అని కేంద్రాన్ని నిలదీశారు. పీఎం మోదీ గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని మెచ్చుకోలేదా ? కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ గ్రోత్ ఇంజిన్‌గా అభివర్ణించారు. కేంద్ర జలసంఘం చైర్మన్ మసూద్ హుస్సేన్ కాళేశ్వరం ప్రాజెక్టును అద్భుతం అని ప్రశంసించారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ శర్మ సైతం కాళేశ్వరం ప్రాజెక్టుకు అప్పులివ్వడాన్ని సమర్దించారు. కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికే ఆదర్శమని గొప్పగా చెప్పారు. ఇంజనీరింగ్ అద్భుతం అని, అనుకున్న సమయానికి ముందే ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందని కితాబిచ్చారు అని గుర్తుచేస్తూ ఆ పాత వీడియోలను మీడియా ఎదుట ప్రదర్శించారు.

గతంలో ఇలా కాళేశ్వరం ప్రాజెక్టును అద్భుతం అని మెచ్చుకున్న బీజేపి నేతలే ఇప్పుడు అదే ప్రాజెక్టుపై ఎందుకు బురద చల్లుతున్నారని మంత్రులు ప్రశ్నించారు. గతేడాది జులై 22న కేంద్రమంత్రి విశ్వేశ్వర్ తుడు పార్లమెంటులో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని సభా సాక్షిగా తెలిపారని గుర్తుచేసుకున్నారు. ఇప్పటి మంత్రి షేకావత్ కూడా పార్లమెంటు వేదిగ్గా స్పందిస్తూ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ( Kaleshwaram Project ) అవినీతి జరగలేదని స్పష్టంచేశారు. ఈ మీడియా సమావేశంలో మంత్రులు టి. హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్‌తో పాటు ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, మాణిక్ రావు, సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ తాత మధు పాల్గొన్నారు.

Also Read : Ponguleti Srinivas Reddy: టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాకిచ్చిన ఈటల.. బీజేపీలోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 

Also Read : Vijayashanthi: రాములమ్మ పార్టీ మారుతున్నారా..బీజేపీ నేతలపై వ్యాఖ్యల వెనుక ఆంతర్యం అదే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P2DgvH

Apple Link - https://apple.co/3df6gDq

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News