Ponguleti Srinivas Reddy: టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాకిచ్చిన ఈటల.. బీజేపీలోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti Srinivas Reddy to join BJP: బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌ను వేగవంతం చేసింది. అధికారపార్టీ నేతలే టార్గెట్ గా మంత్రాంగం నడుపుతున్న ఈటల రాజేందర్ కు బడా లీడర్ చిక్కినట్లే కనిపిస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 18, 2022, 04:31 PM IST
Ponguleti Srinivas Reddy: టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాకిచ్చిన ఈటల.. బీజేపీలోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti Srinivas Reddy to join BJP: బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌ను వేగవంతం చేసింది. అధికారపార్టీ నేతలే టార్గెట్‌గా మంత్రాంగం నడుపుతున్న ఈటల రాజేందర్‌కు బడా లీడర్ చిక్కినట్లే కనిపిస్తోంది. టీఆర్ఎస్ పార్టీ అధిష్టానంపై కొంతకాలంగా గుర్రుగా ఉన్న ఆ నేత బీజేపీ వైపు చూస్తున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఆ నేత మరెవరో కాదు.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డే అనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్నిరకాలుగా బలంగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్రమంగా టీఆరెస్‌ పార్టీకి దూరం అవుతూ బీజేపీకి దగ్గరవుతుండటం రాజకీయవర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పోటీగా నామా నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వర రావులు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. వీరేకాక జిల్లా మంత్రి పువ్వడా అజయ్ కుమార్, టీఆరెస్ అధినాయకత్వం వ్యవహారశైలితో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఇటీవల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె ఎంగేజ్మెంట్ వేడుకకు టీఆరెస్ ముఖ్యులు దూరంగా ఉండగా.. బీజేపీ అగ్రనేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి హాజరైన తీరు చూస్తేనే పొంగులేటి తదుపరి అడుగులు బీజేపీ వైపే పడబోతున్నయనే ప్రచారం జోరందుకుంది. 

ఇక తాజాగా పొంగులేటి కూతురు రిసెప్షన్ వేడుకకు బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్, గడ్డం వివేక్, ఎమ్మెల్యే రఘునందన్ రావులు హాజరయ్యారు. ఈ వేడుకకు టీఆర్ఎస్ నేతలు పెద్దగా రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కూడా ఈటల రాజేందర్ బీజేపీలోకి ఆహ్వానించినట్లుగా వార్తలు వస్తున్నాయి. పొంగులేటి కూతురు ఎంగేజ్‌మెంట్ రోజున బీజేపీ నేతల హడావిడి కొనసాగినట్లే.. రిసెప్షన్ రోజున కూడా సేమ్ సీన్ పునరావృతం అయ్యేసరికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరడం పక్కా అనే ప్రచారం మరింత ఊపందుకుంది. 

2014లో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన పొంగులేటి తర్వాతి పరిణామాలతో టీఆర్ఎస్‌లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆరెస్ అభ్యర్థుల ఓటమికి పరోక్షంగా కారణం పొంగులేటినే అంటూ వార్తలు రావడంతో టీఆర్ఎస్ పార్టీ అధిష్టానము కొంత దూరంపెట్టిందనే వార్తలు ఉన్నాయి. దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రతీసారి టికెట్ ఆశించడం, భంగపడటం రొటీన్ వ్యవహారంగా మారింది. తాజాగా టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సీటును ఆశించిన ఖమ్మం జిల్లాకే చెందిన గాయత్రీ రవికి కేటాయిస్తూ అధిష్టానం షాక్ ఇవ్వడం గమనార్హం. టికెట్ల కోసం ఆశపడటం ఆ ప్రయత్నాలు నెరవేరకపోవడంతో అసంతృప్తిగా ఉన్నా పొంగులేటి సరైన అవకాశం కోసం చూస్తున్నట్టు తెలుస్తోంది. రైట్ టైం చూసి బీజేపీలో చేరి కేసీఆర్‌కు దిమ్మతిరిగేలా రిటర్న్ షాక్ ఇచ్చేందుకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

Also Read : Vijayashanthi: రాములమ్మ పార్టీ మారుతున్నారా..బీజేపీ నేతలపై వ్యాఖ్యల వెనుక ఆంతర్యం అదే..!

Also Read : Munugode Bypolls Updates: మునుగోడులో బీజేపి సభ సక్సెస్‌కు బండి సంజయ్ స్కెచ్ ఇదేనట

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P2DgvH

Apple Link - https://apple.co/3df6gDq

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x