Mock assembly on childrens day video goes viral: దేశ మంతట ఇటీవల బాలల దినోత్సవ వేడుకలు ఎంతో గ్రాండ్ గా జరిగాయి. మన దేశానికి తొలి ప్రధాని పండిత్ జవహార్ లాల్ నెహ్రు జన్మదినం నేపథ్యంలో.. ప్రతి ఏడాది నవంబర్ 14న చిల్డ్రన్స్ డేను జరుపుకుంటుంటాం. అయితే..నెహ్రుకు పిల్లలంటే చాలా ఇష్టమంట. ఆయన ఇండిపెండెన్స్ కోసం పొరాటంలో ఉంటూ తన ఒక్కగానొక్క కూతురుకు దూరమయ్యారంట. అందుకు ఆయన  పిల్లలంటే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వారితో మాట్లాడుతూ.. ఆప్యాయంలో, ప్రేమతో దగ్గరకు తీసుకుంటారు. చాలా మంది ఆయనను ప్రేమతో చాచా అని కూడా పిలుస్తారు. నిన్న దేశ వ్యాప్తంగా బాలల దినోత్సవం గ్రాండ్ గా జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే.. తెలంగాణలో కూడా బాలల దినోత్సవం వేళ అనేక పాఠశాలలో ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలుస్తొంది. అంతే కాకుండా.. ఈ క్రమంలో హైదరబాద్ లో స్టూడెంట్స్ వినూత్నంగా మాక్ అసెంబ్లీని నిర్వహించారు.ఈ కార్యక్రమం.. ఎస్ సీఈఆర్టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యూకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ కార్యాలయం ప్రాంగణలో అండర్ 18 విద్యార్థులతో మాక్ అసెంబ్లీ జరిగింది.


 



ఈ మాక్ అసెంబ్లీకి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం  భట్టీ విక్రమార్క, పొన్నం ప్రభాకర్ తదితరులు హజరయ్యారు. విద్యార్థులు.. అధికార, అపోసిషన్ లీడర్లుగా, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, అపోసిషలన్ లీడర్లుగా ఆయా స్థానాల్లో కూర్చున్నారు. సీఎం రేవంత్ కామన్ గా ఇప్పటిలాగే ప్రభుత్వంలో ఉన్నారు. అయితే.. ఒక విద్యార్థి అపోసిషల్ నేతగా.. సీఎం రేవంత్ పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సొషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 



మాక్ అసెంబ్లీలో విద్యార్థిని ప్రభుత్వంను ప్రశ్నిస్తు.. తెలంగాణ ఒలింపిక్స్ 2024 లో ఒక్కపథకం కూడా గెల్చుకొలేదన్నారు. కనీసం ఎంత మంది పాల్గొన్నారో కూడా తెలియలేదన్నారు.  మన సర్కారు ఏంచేస్తుందని ఫైర్ అయ్యారు . అంతే కాకుండా.. గాజులు వేసుకుని ముద్దా మందారం సీరియల్ చూస్తుందా అంటూ ఏకీపారేశారు. దీనిపై ప్రభుత్వంను యువతి ఘాటుగా ప్రశ్నించారు. అంతే కాకుండా.. వచ్చే ఒలింపిక్స్ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని రెచ్చిపోయింది.


అయితే.. మాక్ అసెంబ్లీలో సీఎం రేవంత్ కూడా ఎంతో ఉత్సాహాంతో పాల్గొన్నారు. విద్యార్థులకు అనేక విషయాలు చెప్పినట్లు తెలుస్తొంది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్తుల వయస్సు 25 నుంచి 21కి తగ్గించే బిల్ ఆమోదం దిశగా కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందని తెలుస్తొంది. 21 ఏళ్లకే ఐఏఎస్ లు, ఐపీఎస్ లు దేశానికి సేవలు చేస్తున్నప్పుడు.. ఒక ఎమ్మెల్యేగా పోటీకి ఎందుకు 25 ఏళ్ల వరకు ఆగాలని విద్యార్తులు ప్రశ్నించినట్లు తెలుస్తొంది.


 Read more:TSPSC: తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్షలో కేటగిరీలవారీగా పాసైన అభ్యర్థులు.. ఆరోజే నియామక పత్రాలు జారీ..


ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ..ఓటు హక్కును.. 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించిన ఘనత దివంగత ప్రధాని రాజీవ్ గాంధీదేన్నారు.  అంతే కాకుండా.. ప్రస్తుత సర్కారు కూడా.. ఎమ్మెల్యేల వయస్సు, ఇంకా అనేక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు ఈ మాక్ అసెంబ్లీకి తెలంగాణ జిల్లా వ్యాప్తంగా స్కూళ్లనుంచి విద్యార్తులు, విద్యార్థినులు హజరైనట్లు తెలుస్తొంది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.