Hyderabad MMTS Ticket Fare Reduced: హైదరాబాద్ ఎంఎంటీఎస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్. నేటి (మే 5) నుంచి ఎంఎంటీఎస్ ఫస్ట్ క్లాస్ టికెట్ ధరలు 50 శాతం తగ్గనున్నాయి. ఫస్ట్ క్లాస్ సింగిల్ జర్నీ ప్యాసింజర్లకు ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఆర్టీసీ బస్సు ఛార్జీలు కూడా పెరగడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఎంఎంటీఎస్ టికెట్ ధరలను తగ్గించడం ప్రయాణికులకు ఉపశమనం కలిగించినట్లయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తగ్గిన టికెట్ ధరల వివరాలు :


1కి.మీ-10కి.మీ వరకు ఇదివరకు రూ.50గా ఉన్న ఎంఎంటీఎస్ ఫస్ట్ క్లాస్ టికెట్ ధర ఇప్పుడు రూ.25కి తగ్గించబడింది.


11కి.మీ-15కి.మీ వరకు ఇదివరకు రూ.65గా ఉన్న ఎంఎంటీఎస్ ఫస్ట్ క్లాస్ టికెట్ ధర ఇప్పుడు రూ.35కి తగ్గించబడింది.


116కి.మీ-25కి.మీ వరకు ఇదివరకు రూ.100గా ఉన్న ఎంఎంటీఎస్ ఫస్ట్ క్లాస్ టికెట్ ధర ఇప్పుడు రూ.55కి తగ్గించబడింది.


26కి.మీ-35కి.మీ వరకు ఇదివరకు రూ.145గా ఉన్న ఎంఎంటీఎస్ ఫస్ట్ క్లాస్ టికెట్ ధర ఇప్పుడు రూ.85కి తగ్గించబడింది.


36కి.మీ-45కి.మీ వరకు ఇదివరకు రూ.155గా ఉన్న ఎంఎంటీఎస్ ఫస్ట్ క్లాస్ టికెట్ ధర ఇప్పుడు రూ.90కి తగ్గించబడింది.


ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ సబర్బన్‌లో 86 ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్-ఫలక్‌నుమా-లింగంపల్లి-తెల్లాపూర్-రామచంద్రాపురం మధ్య సుమారు 50 కి.మీ మేర ఈ రైళ్లు నడుస్తున్నాయి. సబర్బన్ ప్రయాణికులకు వేగవంతమైన సర్వీసులతో పాటు చౌక ధరలో ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఎంఎంటీఎస్ ఫస్ట్ క్లాస్ టికెట్ ధరలను తగ్గించినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.  


Also Read: Saroor Nagar Honour Kiling: హైదరాబాద్‌లో పరువు హత్య... నడిరోడ్డుపై గడ్డపారలతో దాడి... యువకుడు అక్కడికక్కడే మృతి...  


Also Read: Horoscope Today May 5 2022: రాశి ఫలాలు... ఆ రంగాల్లో ఉన్న ఆ రాశి వారు బాగా రాణిస్తారు...  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.