Horoscope Today May 5 2022: రాశి ఫలాలు... ఆ రంగాల్లో ఉన్న ఆ రాశి వారు బాగా రాణిస్తారు...

Horoscope Today  May 5 2022:  నేటి రాశి ఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి ఇవాళ నిరాశజనకంగా గడుస్తుంది. చేపట్టిన పనుల్లో వెనుకబడుతారు. పనులు ఎంతకీ ముందుకు సాగవు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 5, 2022, 06:24 AM IST
  • నేటి రాశి ఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి నిరాశజనకమైన ఫలితాలు
  • కొన్ని రాశుల వారికి ఉద్యోగ, వ్యాపార రంగంలో సానుకూల ఫలితాలు
  • నేటి రాశి ఫలాల్లో ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి
Horoscope Today May 5 2022: రాశి ఫలాలు... ఆ రంగాల్లో ఉన్న ఆ రాశి వారు బాగా రాణిస్తారు...

Horoscope Today May 5 2022: నేటి రాశి ఫలాలను గమనిస్తే... కొన్ని రాశుల వారికి ఇవాళ కలిసొస్తుంది. చంద్ర అనుగ్రహంతో ఉద్యోగ, వ్యాపార రంగంలో రాణించగలరు. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. కొన్ని రాశుల వారిని నిరాశ, నిస్పృహలు వెంటాడుతాయి. తద్వారా మానసిక ప్రశాంతతకు దూరమవుతారు. నేటి రాశి ఫలాల ప్రకారం ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయంటే... 

మేషరాశి ( Aries)

చంద్రుడి అనుగ్రహంతో విధి మీకు అనుకూలంగా ఉంటుంది. ఇవాళ చాలా ఉత్సాహవంతంగా కనిపిస్తారు. చేపట్టిన పనులపై మరింతగా ఫోకస్ చేయగలుగుతారు. మీ కష్టానికి తగిన ఫలితం సక్సెస్ రూపంలో కనిపిస్తుంది. కొలిగ్స్ సహాయ సహకాలు లభిస్తాయి. వృత్తి రీత్యా షార్ట్ ట్రిప్‌కు ప్లాన్ చేసే అవకాశం ఉంది. మీ తోబుట్టువుల నుంచి శుభవార్త అందుతుంది.

వృషభ రాశి (Taurus)

కుటుంబ సంబంధిత విషయాల్లో ఇవాళ బిజీగా గడుపుతారు. కుటుంబ పరమైన బాధ్యతల్లో మునపటి కన్నా ఇప్పుడు మరింత బాధ్యాతయుతంగా మెదులుతారు. వ్యక్తిగత విషయాల్లో అనవసర వాదనలకు దిగవద్దు. మీ అహంకారం కుటుంబ జీవితంపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఇవాళ సాయంత్రానికి అన్నీ చక్కదిద్దుకుంటాయి. పెట్టుబడుల విషయంలో మీ అంతరాత్మను ఫాలో అవండి.

మిథున రాశి (GEMINI)

గందరగోళ పరిస్థితులు సర్దుకుంటాయి. ఇప్పుడు మీ మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది. ఖర్చులకు, సంపాదనకు మధ్య బ్యాలెన్స్ ఉంటుంది. తద్వారా ఆర్థిక పురోగతి ఉంటుంది. పని భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నించండి. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఆరోగ్యం కాస్త ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు ఉన్నత విద్యకు సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు అనువైన సమయం.

కర్కాటక రాశి (Cancer) 

ఆరోగ్యం కాస్త ఆందోళన కలిగిస్తుంది. మానసిక అలసట నిద్రకు దూరం చేస్తుంది. ఇవాళ్టి పనులపై దృష్టి పెట్టలేకపోతారు. బద్దకంగా ఫీలవుతారు. తద్వారా సకాలంలో పనులు పూర్తి చేయలేక విమర్శలు ఎదుర్కొంటారు. పనిని తప్పించుకునే మార్గాల కోసం అన్వేషించవద్దు. ఇతరుల మాటలు విని మీ లక్ష్యాలకు దూరంగా జరగవద్దు. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. 

సింహ రాశి (LEO)

సోషల్ గెట్ టు గెదర్‌లో బిజీగా గడుపుతారు. పాత స్నేహితులను కలుసుకుంటారు. మీ నెట్‌వర్క్ మరింత విస్తృతమవుతుంది. భవిష్యత్తులో అది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఎగుమతులు, దిగుమతుల రంగంలో ఉన్నవారు... గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నవారు... కళాకృతుల తయారీ రంగంలో ఉన్నవారు బాగా రాణిస్తారు. ప్రేమికులు సంతోషకర సమయం గడుపుతారు.

కన్య రాశి (Virgo)

కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఫ్యామిలీ బిజినెస్‌ను విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తారు. తద్వారా మీ ఫ్యామిలీ పలుకుబడి మరింత పెరుగుతుంది. కుటుంబంలో కొత్త జంటలు శుభవార్త చెబుతారు. విద్యార్థులు స్కాలర్‌షిప్స్‌కు అప్లై చేస్తారు. రాజకీయ వ్యవహారాలు చూసేవారికి అనుకూల సమయం.

తులా రాశి (Libra)

ఇవాళ మీరు ఎక్కువగా ఆధ్యాత్మికత వైపు దృష్టి సారిస్తారు. పాత పెట్టుబడులు లాభాలు తీసుకొస్తాయి. మీ బాస్‌తో మంచి రిలేషన్ ఏర్పడుతుంది. అది మీకు ప్రమోషన్స్‌ కూడా తీసుకొస్తుంది. తోబుట్టువులతో ఆస్తి తగాదాల పరిష్కారమవుతాయి. మీరు ప్రేమించే వ్యక్తులతో లేదా జీవిత భాగస్వామితో కటువుగా మాట్లాడవద్దు. ఇతరులతోనూ నోరు జారి అమర్యాదగా వ్యవహరించవద్దు. 

వృశ్చిక రాశి (Scorpio)

ఇవాళ మిమ్మల్ని నిద్ర లేమి వెంటాడుతుంది. సరైన నిద్ర లేక రోజంతా అలసటగా ఉంటారు. చూసేందుకు చాలా కేర్‌లెస్‌గా కనిపిస్తారు. మీ అంతర్గత శక్తిపై అది నెగటివ్ ప్రభావం చూపిస్తుంది. పనిలోనూ బద్దకంగా ఉంటారు. చేపట్టిన ప్రాజెక్టుపై దాని ప్రభావం ఉంటుంది. ప్రస్తుతానికి పెట్టుబడులకు దూరంగా ఉండండి. లాంగ్ డ్రైవింగ్‌కి దూరంగా ఉండటం బెటర్.

ధనుస్సు రాశి (Sagittarius)  

ఇవాళ మీరు సంతోషంగా గడుపుతారు. మీ చుట్టూ ఉన్నవారికి కూడా సంతోషాన్ని పంచుతారు. కుటుంబ జీవితం సంతోషకరంగా, సాఫీగా సాగుతుంది. మీ జీవిత భాగస్వామితో రొమాంటిక్‌గా గడుపుతారు. వృత్తిపరమైన కీలక నిర్ణయాల్లో మీ కుటుంబం మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది. కొత్త ప్రాజెక్టులు మొదలుపెడుతారు. లేదా బిజినెస్ విస్తృతికి ప్రణాళికలు రూపొందిస్తారు.

మకర రాశి (Capricorn) 

ఇవాళ చాలా ఓపికగా ఉంటారు. చంద్ర అనుగ్రహంతో చేపట్టిన పనుల్లో సానుకూలత ఉంటుంది. వృత్తిరీత్యా మీ పెర్ఫామెన్స్ బాగుంటుంది. రివార్డులు పొందుతారు. కుటుంబ సభ్యులు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. అందరి ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి తగిన జాబ్ లభిస్తుంది. ప్రేమికులు డేటింగ్‌ను ఆస్వాదిస్తారు.

కుంభ రాశి (Aquarius)

మీ చుట్టూ ఉన్నవారి నుంచి ఎక్కువ ఆశించకండి. అది మిమ్మల్ని బాధపడేలా చేస్తుంది. మిమ్మల్ని మీరు అన్వేషించుకోవడం, మిమ్మల్ని మీరు విశ్లేషించుకోవడం చేస్తారు. తద్వారా మీ బలాలు, బలహీనతలపై మీకు ఒక స్పష్టత వస్తుంది. అది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించేందుకు మిమ్మల్ని సంసిధ్దులను చేస్తుంది. 

మీన రాశి (Pisces) 

ఇవాళ మిమ్మల్ని అసంతృప్తి వెంటాడుతుంది. ఒక్క క్షణం కూడా సంతృప్తికరంగా ఉండదు. ఓపిక నశిస్తుంది. అది మీ పనిపై ప్రభావం చూపుతుంది. చిన్న చిన్న పొరపాట్లు ఇబ్బంది పెడుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. యోగా, ధ్యానం ద్వారా కాస్త మానసిక ప్రశాంతత పొందుతారు.

Also Read - Kavitha Vs Arvind Dharmapuri : ఎమ్మెల్సీ కవితకు కౌంటర్ ఇచ్చిన అర్వింద్ 

Also Read - Kavitha Vs Arvind Dharmapuri : ఎంపీ అర్వింద్‌పై కవిత ఫైర్.. అర్వింద్ సమాధానం ఏంటంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News