హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ దిశపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో అరెస్ట్ అయిన నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించిన వివరాలు భయం గొలిపేలా ఉన్నాయి. పైశాచిక ఆనందం పొందడానికి నిందితులు ఏ స్థాయికి దిగజారారో.. ఎంత కృూరంగా ప్రవర్తించారో వింటుంటేనే ఒక్కొక్కరికి ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఒక పథకం ప్రకారం బాధితురాలిని ట్రాప్ చేసిన నిందితులు.. ఆమె పట్ల నిర్ధాక్ష్యిణ్యంగా, అతి క్రూరంగా ప్రవర్తించారు. ట్రక్కులో ఓవైపు బాధితురాలిపై బలవంతంగా అత్యాచారం చేస్తూనే.. మరోవైపు ఆమెను బెదిరిస్తూ మద్యం తాగించిన తీరు నిందితుల నీచ ప్రవర్తలను బట్టబయలు చేస్తోంది. సామూహిక అత్యాచారం జరిపి బాధితురాలిని బలితీసుకోవడంతోనే నలుగురు దుర్మార్గుల రాక్షసక్రీడ ఆగలేదు. బాధితురాలిని చంపేసిన తర్వాత సైతం ఆమె శవంపై నిందితులు అత్యాచారం జరపడం సదరు నిందితుల కృూర మనస్తత్వానికి అద్దం పడుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : వాళ్లను చంపేద్దాం సార్.. ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి!!


నిందితుల క్రూర మనస్తత్వానికి సంబంధించి వెలుగు చూస్తోన్న నిజాలు పౌరసమాజాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. మనుషులుగా పుట్టి, మనుషుల్లో కలిసి తిరుగుతూనే.. కృూరమృగాలుగా ఎలా తయారవుతున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యేలా చేసింది ఈ ఘటన. ఇలాంటి కృూరమృగాల మధ్యేనా మనం నిత్యం బతుకీడుస్తున్నామనే ఆలోచన కూడా ఒళ్లు జలదరించేలా చేస్తోందని మహిళలు, ఆడపిల్లలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. Read also : యువతిపై సామూహిక అత్యాచారం, హత్య కేసు: నిందితులున్న చర్లపల్లి జైలు బయట ఉద్రిక్తత.. భారీ సంఖ్యలో పోలీసుల మోహరింపు