Biryani for Just Rs.10: బిర్యానీ అంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు. ఆ వాసన వస్తేనే చాలామందికి సగం కడుపు నిండిపోతుంది. అయితే రాను రాను బిర్యానీ కాస్ట్లీ అయిపోతోంది. రెస్టారెంట్‌కి వెళ్లి బిర్యానీ తినాలంటే కనీసం రూ.200 ఉండాల్సిందే. రోడ్డు పక్కన ఉండే మొబైల్ ఫుడ్ ట్రక్స్ లేదా చిన్న చిన్న బిర్యానీ పాయింట్స్ వద్ద కూడా కనీసం రూ.100 పెడితేనే బిర్యానీ. కానీ హైదరాబాద్‌లోని అప్జల్‌గంజ్‌లో ఓ వ్యక్తి కేవలం రూ.10కే బిర్యానీ విక్రయిస్తున్నాడు.పేదల కడుపు నింపేందుకు గత పదేళ్లుగా అతను అతి తక్కువ ధరకే బిర్యానీ అమ్ముతున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అతని పేరు ఇఫ్తికార్ మొమిన్. అప్జల్‌గంజ్ బస్టాండ్ ప్రాంతంలో బిర్యానీ పాయింట్ నిర్వహిస్తున్నాడు. మొదట్లో రూ.5కే వెజ్ బిర్యానీ విక్రయించేవాడు. ధరలు పెరగడంతో తాను కూడా బిర్యానీ ధర పెంచక తప్పలేదని చెబుతాడు. ప్రస్తుతం ప్లేట్ వెజ్ బిర్యానీ రూ.10కి విక్రయిస్తున్నాడు. రోజుకు దాదాపు 1500 ప్లేట్లు అమ్ముతుంటారు. ప్లేటుకు రూ.1 మాత్రమే లాభం ఉంటుందని..అయినా సరే తక్కువ ధరకు అందించాలనే ఉద్దేశంతో రూ.10కే బిర్యానీ విక్రయిస్తున్నామని మొమిన్ చెబుతున్నాడు. నిత్యం వందలాది మంది బిర్యానీ తినేందుకు ఇక్కడికి వస్తుంటారు.


సాధారణంగా తక్కువ ధరకే బిర్యానీ అంటే అంత క్వాలిటీగా ఉండకపోవచ్చుననే అనుమానం రావొచ్చు. అయితే ఈ రూ.10 బిర్యానీ మాత్రం చాలా క్వాలిటీగా ఉంటుంది. ఇందులో బంగాళదుంపలు, గ్రీన్ పీస్, బీన్స్, క్యారెట్స్ వంటివన్నీ వేస్తారు. అందుకే మొమిన్ బిర్యానీ పాయింట్ వద్ద బిర్యానీ తినేందుకు చాలా మంది వస్తుంటారు. తమ బిర్యానీకి ఉన్న ఆదరణ చూసి ఉస్మానియా హాస్పిటల్, కోఠి ఉమెన్స్ కాలేజీ, అబిడ్స్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల వద్ద కూడా మొమిన్ బిర్యానీ పాయింట్లు తెరిచాడు. 



 


Also Read: Keerthy Suresh Dog in Special Flight: కుక్క పిల్ల కోసం కీర్తి సురేష్ స్పెషల్ ఫ్లైట్


Also Read: Ram Pothineni Marriage : రామ్ పోతినేని ప్రేమ పెళ్లికి రంగం సిద్ధం.. అమ్మాయి ఎవరో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.