Commissioner Ranganath On Woman Suicide: హైడ్రాకు మహిళ ఆత్మహత్యకు ఏ సంబంధం లేదని తేల్చిచెప్పారు కమిషనర్‌ రంగనాథ్‌. ఇలాంటి దుష్ప్రచారాలు హైడ్రాపై కొందరు కావాలనే చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏ కూల్చివేతలు జరిగినా అది హైడ్రాకే ఆపాదిస్తున్నారు. ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా ఎవరికీ హైడ్రా నోటీసులు ఇవ్వలేదు. మూసీకి సంబంధించిన ఏ సర్వేలోనూ హైడ్రా భాగం కాలేదన్నారు. అంతేకాదు మూసీ పరివాహక ప్రాంతంలో శనివారం భారీ కూల్చివేతలు ఉంటాయని కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని రంగనాథ్‌ మండిపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలా ఉండగా నిన్న సాయంత్రం కూకట్‌పల్లి యాదవ బస్తీకి చెందిన బుచ్చమ్మ అనే మహిళ తన ఇల్లు కూల్చివేస్తారనే భయంతో ఆత్మహత్యకు పాల్పడింది. నల్లచెరువు వద్ద హైడ్రా అధికారులు సర్వే చేపట్టడంతో ఇల్లు కూల్చివేస్తారనే భయంతో ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని స్థానికుల సమాచారం. హైడ్రా కూల్చివేతల్లో తన కూతుళ్లకు కట్నంగా ఇచ్చిన ఇల్లు కోల్పోతామనే భయంతో ఆమె ఆత్మహత్యకు పాల్పిడిందని అన్నారు. తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె శుక్రవారం సాయంత్రం బలవన్మరణానికి పాల్పడ్డారు. హైడ్రా ఆధ్వర్యంలో నల్లచెరువు పరిధిలో బఫర్ జోన్‌లోకి వచ్చే ఇళ్లు కూల్చివేస్తారని స్థానికంగా కలకలం రేపింది.


ఇదీ చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్‌ అదిరిపోయే పాపులర్‌ రీఛార్జీ ప్లాన్‌.. 336 రోజుల వ్యాలిడిటీ మరిన్ని బెనిఫిట్స్..  


హైడ్రా వీకెండ్స్‌ వచ్చాయంటే చాలు హైడ్రా ఎక్కడ కూల్చివేతలకు పాల్పడుతుందో అని హైదరాబాద్‌వాసులు సైతం బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా చెరువులు, నాలాల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లోకి వచ్చే నిర్మాణాలను కూల్చివేతలు చేపడుతుంది. పోలీసులను నియమించి భారీ భద్రత నడుమ కూల్చివేతలు పాల్పడుతుంది. నాగార్జున ఎన్‌ కన్వెన్షన్‌తో ఊపందుకున్న హైడ్రా వీకెండ్‌ వచ్చిందంటే చాలు పేదలు తమ ఇళ్లను ఎక్కడ హైడ్రా కూల్చివేస్తుందో అని నిద్ర లేని రాత్రులను గడుపుతున్నారు. కష్టం చేసి లోన్లు తీసుకుని ఇళ్లు నిర్మించుకుంటే ఇలా హైడ్రా కూల్చివేతలు చేపట్టి రోడ్డు మీద పాడేయడం ఏంటని కన్నీటి పర్యంతమవుతున్నారు. చివరకు కోర్టులో పెండింగ్‌లో ఉన్న భవనాలను కూడా హైడ్రా కూల్చివేతలకు పాల్పడటంతో హైకోర్ట్‌ సైతం హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌పై సీరియస్‌ అయింది. దీనికి జవాబు చెప్పాల్సిందేనని రంగనాథ్‌కు నోటీసులు కూడా ఇచ్చింది.


ఇదీ చదవండి: ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ క్లర్క్‌ ప్రిలిమినరీ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌తో నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోండి..  


గ్రేటర్‌ పరిధిలో ఉండే చాలామంది పేదలు, మధ్యతరగతి కుటుంబాలు తమ ఇంటిపై హైడ్రా మార్కు ఎక్కడ పడుతుందో? ఎప్పుడు కూల్చివేతలు చేస్తారో అనే భయంతోనే జీవనం సాగిస్తున్నారు. ముఖ్యంగా నిన్న చైతన్యపురిలో కూడా హైడ్రా కూల్చివేతలు చేపడతామని మార్కులు వేయడానికి వెళ్లినప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు సీఎం రేవంత్‌ను సైతం వారు తిట్టుకుంటున్నారు. ఆడపిల్లలు ఉన్నారు, పిల్లపాపలు ఉన్నవాళ్లం ఇలా కూల్చివేతలకు పాల్పడితే తాము ఎక్కడికి వెళ్లాలని స్థానిక మహిళల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఆ దృశ్యాలు మనసులను కలచివేస్తోంది..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.