Hydra Victims: హైదరాబాద్ మహానగరంలో చెరువులు, కుంటలను కాపాడడానికి తీసుకొచ్చిన హైడ్రా ఇపుడు రేవంత్ రెడ్డికి బ్యాక్ ఫైర్ అయ్యేలా కనిపిస్తుంది. హైడ్రా సర్వేకు వ్యతిరేకంగా బాధితులు రోడ్డెక్కారు. తమ ఇండ్లను అన్యాయంగా కూల్చివేస్తున్నారని మండిపడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వందల మంది రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో పురానాపూల్‌ నుంచి లంగర్ హౌస్‌ వైపు భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..నిరసన కారులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మరోవైపు లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రింగ్ రోడ్ పిల్లర్ నెంబర్ 102 వద్ద ఆశం నగర్‌ కాలనీ వాసులు బైఠాయించారు. దీంతో రాజేంద్రనర్‌ నుండి మోహిదీపట్నం వైపు పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. చెరువులు, కుంటలు ఆక్రమించుకున్న బడా బాబులను ఒదిలిపెట్టి సామాన్యులపై మీ ప్రతాపం ఏంటి అంటూ నిలదీస్తున్నారు. సర్వ నాశనం అయిపోతావ్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను శాపనార్ధాలు పెడుతున్నారు.


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు హైడ్రా బాధితులు. మూసీపరివాహక ప్రాంతాల్లోని ఇళ్లను కూల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఇళ్ల నుంచి బయటకు వెళ్లేది లేదంటున్నారు. తమకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లులు అవసరం లేదని ఖరాకండిగా చెబుతున్నారు. ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానకి శాపనార్థాలు పెడుతూ సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


హైడ్రా బాధితుల కోసం కొత్తపేటలోని గణేష్ నగర్‌లో మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ధర్నాకు దిగారు. ఈటలను చూసి బాధితులు బోరున విలపించారు. బాధితుల వివరాలు అడిగి తెలుసుకున్న ఈటల హైడ్రా కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిలదీసారు.


ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !


ఇదీ చదవండి:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.