HYDRAA Demolish: మూసీ నది సరిహద్దు ప్రాంతం.. నదీ పరివాహకంలో ఉన్న వాటిని కూల్చివేస్తున్న అధికారులు తాజాగా కూల్చివేతలపై సంచలన ప్రకటన చేశారు. ఇప్పటివరకు ఎన్ని ఇళ్లు కూల్చివేతలు చేపట్టారో జాబితా విడుదల చేసింది. హైదరాబాద్ జిల్లావ్యాప్తంగా మూసీ నది పరివాహకంలో ఇప్పటివరకు 163 ఇళ్లను ఖాళీ చేయించినట్లు హైదరాబాద్ ఆర్‌డీఓ మహిపాల్ ప్రకటించారు. మరో 700 నివాసాలను ఖాళీ చేయించాల్సి ఉందని తెలిపారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Dusshera Special: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌.. బతుకమ్మ, దసరాకు లక్కీ చాన్స్‌


 


ఇళ్ల కూల్చివేతలపై ఆర్‌డీఓ మహిపాల్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో కూల్చివేతలపై వివరించారు. 'మొత్తం అన్ని నివాసాలను ఖాళీ చేయించడానికి మరో వారం నుంచి పది రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. జియాగూడ 15, పిల్లిగుడిసెలు 136, ప్రతాపసింగారం 16, నార్సింగిలో 7 కుటుంబాలకు పునరావాసం కల్పించాం. 26 నుంచి మార్కింగ్, ఇళ్ల ఖాళీ చేయించే ప్రక్రియ చేపట్టాం' అని వివరించారు.

Also Read: KTR HYDRAA: హైడ్రా పేరుతో రేవంత్‌ రెడ్డి దేశంలోనే అతిపెద్ద కుంభకోణం: కేటీఆర్‌ సంచలనం


 


'ఖాళీ చేయించిన ఇళ్లను  కూల్చివేత ప్రారంభిస్తాం. ఇల్లు ఖాళీగా ఉంటే వాటిలోకి మళ్లీ వేరే వాళ్లు వచ్చి ఉండే అవకాశం ఉండడంతో కూల్చివేయాలని నిర్ణయించాం. రంగారెడ్డి జిల్లా పరిధిలో మూసీ నిర్వాసితుల్లో 23 కుటుంబాలు తరలించాం. మేడ్చల్ జిల్లా పరిధిలో మూసీ నిర్వాసితుల్లో 33 కుటుంబాల తరలించాం' అని ఆర్‌డీఓ మహిపాల్‌ తెలిపారు. 


డబుల్‌ బెడ్రూమ్‌ కేటాయింపు
కూల్చివేతల్లో భాగంగా మంగళవారం ఉదయం చాదర్‌ఘాట్‌లోని మూసానగర్ , రసూల్‌పురాలో ఖాళీ చేసిన ఆర్‌బీ-ఎక్స్‌ పరిధిలోని మూసీ పరివాహక ఇళ్లను కూల్చివేశారు. మూసీ పరివాహిక ప్రాంతంలో ఉన్న కుటుంబీకులను  ఇప్పటికే ఖాళీ చేయించి పిల్లి గుడిసెలలో ఉన్న డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను కేటాయించారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమకు ఉండడానికి డబుల్ బెడ్ ఇండ్లు మంజూరు చేయాలని కోరడంతో వారికి 163 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.