I DONT WANT BRIBE : ప్రభుత్వ కార్యాలయం పేరు వినగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది లంచమే. గవర్నమెంట్ ఆఫీసుల్లో అమ్యామ్యాలు సమర్పించుకుంటేనే ఏదైనా పని జరుగుతుందనే టాక్ ఉంది. అధికారులకు కరెన్సీ ఇవ్వనిదే ఫైల్ కదలదని అంటారు. అవినీతిని అరికట్టేందుకు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా అధికారుల తీరు మాత్రం మారడం లేదు. ఏసీబీ, విజిలెన్స్, టాస్క్ ఫోర్స్ టీమ్ లు ఉన్నా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి దందా మాత్రం పోవడం లేదు. పనుల కోసం వెళ్లేవారు కూడా ముందే ఎంతో కొంత ముట్టచెప్పాలని డిసైడ్ అయ్యే వస్తున్నారంటే పరిస్థితి ఎంతకు దిగజారిందో ఊహించుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఉద్యోగులకు లంచాల ముద్ర పడినా అందరూ అలా ఉంటారని లేదు. కొందరు పారదర్శకంగా పని చేసే ఉద్యోగులు కూడా ఉంటారు. రెవిన్యూ శాఖలో లంచాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిందంటారు. అయితే సూర్యాపేట జిల్లాలోని ఓ రెవిన్యూ ఉద్యోగి మాత్రం ఇప్పుడు సంచలనంగా మారారు. లంచం ఇవ్వడం తప్పు, లంచం తీసుకోవడం తప్పు అని నినదిస్తున్నాడు రెవిన్యూ ఇన్సెపెక్టర్.  హుజూర్ నగర్ నియోజకవర్గం. పాలకీడు మండలంలో ఆర్ఐగా పని చేస్తున్న చిలకరాజు నర్సయ్య.. తనకు లంచం వద్దు అంటూ తన జేబుకు కార్డు పెట్టుకున్నారు. తాను పాటించడమే కాదు ఇతర ఉద్యోగులకు సవాల్ విసురుతున్నారు.


ప్రతి రోజు రెవెన్యూ కార్యాలయానికి వచ్చేటప్పుడు తన జేబుకు 'నాకు లంచం వద్దు' అని ఐడీ కార్డును పెట్టుకొని వస్తున్నారు నర్సయ్య. ఆ కార్జు ధరించే రోజు విధులు నిర్వహిస్తున్నారు. రెవెన్యూ కార్యాలయాల్లో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయని.. తాను లంచం తీసుకోకున్నా అదే కోవకు చూస్తున్నారని నర్సయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇలా జేబుకు ఐడీ కార్డు పెట్టుకుని డ్యూటీ చేస్తున్నానని తెలిపారు.చిలకరాజు నర్సయ్య తీరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కాలంలో ఇలాంటి ఉద్యోగులు ఉంటారా అని జనాలు మాట్లాడుకుంటున్నారు.  ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


Also read:  BJP VS TRS: అమిత్ షాకు షాకిచ్చిన టీఆర్ఎస్.. సెప్టెంబర్17న రచ్చ రచ్చేనా?  


Also read:  క్రికెట్‌లో విషాదం.. అంపైర్‌ అసద్‌ రౌఫ్‌ కన్నుమూత! విజయవంతమైన అంపైర్‌గా పేరు కానీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook